Headlines

భారత్‌పై 100% సుంకాలా? అమెరికాకు జేపీమోర్గాన్ సీఈఓ కీలక హెచ్చరిక!


రష్యా ముడి చమురును కొనుగోలు చేస్తున్న దేశాలపై మరిన్ని సుంకాలు విధించే ముందు.. భారత్, ప్రపంచ చమురు మార్కెట్లపై వాటి ప్రభావాలను అమెరికా పరిగణనలోకి తీసుకోవాలని జేపీమోర్గాన్ చేజ్ సీఈఓ జేమీ డిమోన్ సూచించారు. జేపీమోర్గాన్ ఇండియా ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన.. ప్రతిపాదిత ఆంక్షలు, సుంకాల అమలుపై నిర్ణయం తీసుకునే ముందు భారత రిఫైనరీలు రష్యా చమురును ఎలా వినియోగిస్తున్నాయో అర్థం చేసుకోవాలని, భారత్‌తో చర్చలు జరపాలని అన్నారు.

రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇటీవల చట్టం కల్పించింది. భారత్, చైనా రష్యా చమురు కొనుగోలు చేసే ప్రధాన దేశాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిమోన్ కీలక సూచనల చేశారు. భారత రిఫైనరీలు తమ అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల ముడి చమురును ఉపయోగిస్తాయన్నారు. రష్యా నుంచి దిగుమతులు తగ్గిస్తే, అదే రకం చమురును ఇతర వనరుల నుంచి వెంటనే పొందడం అంత సులభం కాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ప్రపంచ చమురు మార్కెట్‌పై కూడా ప్రభావం ఉండొచ్చని సూచించారు.

ఇదిలా ఉండగా, అమెరికా సుంకాల ముప్పు నేపథ్యంలో భారత రిఫైనరీలు చమురు సరఫరాలను వైవిధ్యపరుస్తున్నాయి. ఆగస్టులో భారత్ రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురు 16.5 శాతం తగ్గి రోజుకు సుమారు 21 లక్షల బ్యారెళ్లకు చేరింది. సెప్టెంబర్‌లో ఇది మరింత తగ్గవచ్చని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి.

భారత్ ఇప్పటికే అమెరికాకు ఈ చర్యల వల్ల ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అదే సమయంలో దేశ ఇంధన భద్రతను కాపాడేందుకు వివిధ దేశాల నుంచి చమురు కొనుగోలు కొనసాగిస్తామని వెల్లడించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *