Headlines

ఆసియా క్రీడల్లో ఘోర వైఫల్యం.. అథ్లెట్లకు గదులు లేవా?


జపాన్‌లోని నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల నిర్వహణలో ఘోర వైఫల్యం చోటుచేసుకుంది. అథ్లెట్లకు సరైన వసతి సౌకర్యాలు కల్పించడంలో నిర్వాహకులు విఫలమయ్యారు. ఖర్చు తగ్గించుకునే ఉద్దేశంతో ప్రత్యేక అథ్లెట్స్ విలేజ్ నిర్మించకపోవడంతో, కంటైనర్ స్టైల్ గృహాలు, క్రూయిజ్ షిప్, చెల్లాచెదురుగా ఉన్న హోటళ్లను ఆశ్రయించాల్సి వచ్చింది. దీని ఫలితంగా భారీ గందరగోళం నెలకొంది. చాలామంది అథ్లెట్లు గదుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఈ పరిస్థితిలో భారతీయ క్రీడాకారులకు ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయం అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే వసతి సమస్యలు ఎదుర్కొన్న 35 మంది భారతీయ అథ్లెట్లను మంచి హోటళ్లకు మార్చారు. భవిష్యత్తులో సమస్యలు మరింత పెరగకుండా, కేంద్ర ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. జపాన్‌లోని నాగోయా నగరంలో స్థిరపడిన 2000 మంది ప్రవాస భారతీయ కుటుంబాలను సంప్రదించగా, వారు అత్యవసర సమయాల్లో మన అథ్లెట్లకు తమ ఇంట్లోనే బస కల్పించడానికి ముందుకు వచ్చారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య సైతం జపాన్‌కు చేరుకొని పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

డిసెంబర్‌ రేసులో మరో మూవీ.. హీట్ పెంచుతున్న స్టార్స్‌

అజిత్ రేసింగ్ జర్నీ డాక్యుమెంటరీ గ్లాడియేటర్స్ ట్రైలర్ రివ్యూ

మెగాస్టార్‌ కెరీర్‌లో మరో మైల్‌స్టోన్‌

ఆస్కార్‌ 2027కు భారత్ అధికారిక ఎంట్రీ: మరాఠీ చిత్రం గోంధల్

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *