Headlines

The paradise: నాని ది ప్యారడైజ్‌కు గ్రీన్ సిగ్నల్.. టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి


టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ  ది ప్యారడైజ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ది ప్యారడైజ్  సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో సినిమా విడుదల సమయంలో సాధారణ టికెట్ ధరల కంటే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రత్యేక ప్రీమియర్ షోకు కూడా పెంచిన ధరలను వర్తింపజేసేందుకు ప్రభుత్వం అనుమతించినట్లు తెలుస్తోంది.

ఓ సీన్ కోసం ఆ స్టార్ హీరో ఉతకాని, వాసనొస్తున్న సూట్‌ వేసుకున్నారు: దేవి ప్రసాద్

సెప్టెంబర్ 23న మల్టీప్లెక్స్‌లలో నిర్వహించనున్న ప్రత్యేక ప్రీమియర్ షోకు టికెట్ ధరను రూ.400 వరకు పెంచుకునేందుకు అనుమతి లభించింది. అదే విధంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.300 వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించినట్లు సమాచారం. దీంతో ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షోను ముందుగానే వీక్షించాలనుకునే అభిమానులకు టికెట్ ధరలు సాధారణ రోజులతో పోలిస్తే ఎక్కువగా ఉండనున్నాయి. సినిమా విడుదలైన తర్వాత కూడా టికెట్ ధరల పెంపు కొనసాగనుంది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు మొత్తం 10 రోజుల పాటు పెంచిన టికెట్ ధరలను అమలు చేసేందుకు అనుమతి ఇచ్చింది ఏపీ సర్కార్.

బిందాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మతిపోవాల్సిందే.. ఇప్పుడు ఎలా ఉందంటే

ఈ పది రోజుల వ్యవధిలో థియేటర్లలో రోజుకు 5 షోలు నిర్వహించుకునేందుకు అనుమతి లభించినట్లు సమాచారం. మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లకు వేర్వేరు ధరల పెంపును ప్రభుత్వం అనుమతించింది. మల్టీప్లెక్స్‌లలో: ఒక్కో టికెట్‌పై రూ.75 అదనంగా, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో: ఒక్కో టికెట్‌పై రూ.50 అదనంగా పెంచారు.  కాగా ది ప్యారడైజ్ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్న నేపథ్యంలో నాని అభిమానులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విడుదలకు ముందే టికెట్ ధరల పెంపునకు అనుమతి రావడంతో థియేట్రికల్ రిలీజ్‌పై మరింత హైప్ ఏర్పడింది.

ఇవి కూడా చదవండి



ఆ డైరెక్టర్ అందరి ముందు లాగిపెట్టి కొట్టారు.. ఆ తర్వాత ఆ తప్పు చేయలేదు : బాలాదిత్య

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *