Headlines

CSK: ఐపీఎల్ ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్.. చెన్నై సూపర్ కింగ్స్ కొత్త హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్


CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో భారీ పాపులారిటీ ఉన్న జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మేనేజ్‌మెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2027 సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, భారత మాజీ పేస్ దిగ్గజం జహీర్ ఖాన్ (Zaheer Khan)ను తమ జట్టుకు కొత్త హెడ్ కోచ్(Head Coach)గా నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత అనేక సంవత్సరాలుగా సీఎస్‌కే జట్టుకు కోచ్‌గా సేవలందించి, జట్టును ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ (Stephen Fleming) స్థానంలో జహీర్ ఖాన్ ఈ బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ నిర్ణయం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

దాదాపు 19 సంవత్సరాల పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో విడదీయరాని బంధాన్ని కొనసాగించిన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్, ఇటీవల తన పదవికి వీడ్కోలు పలికారు. గత సీజన్లలో జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడం, అలాగే ఆయన ఇంగ్లాండ్ పురుషుల టెస్ట్ జట్టుకు హెచ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి నిర్ణయించుకోవడంతో ఈ మార్పు జరిగిందని తెలుస్తోంది. ఫ్లెమింగ్ లాంటి దిగ్గజ కోచ్ తప్పుకోవడంతో, ఆ స్థానాన్ని భర్తీ చేసే సరైన వ్యక్తి కోసం వెతికిన సీఎస్‌కే యాజమాన్యం, అంతర్జాతీయ క్రికెట్‌లో అపార అనుభవమున్న జహీర్ ఖాన్ వైపు మొగ్గు చూపింది.

2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న జహీర్ ఖాన్, గతంలో ఐపీఎల్‌లో వివిధ ఫ్రాంచైజీలకు మెంటార్‌గా, కోచింగ్ సిబ్బందిలో సభ్యుడిగా పనిచేసిన అపార అనుభవం కలిగి ఉన్నారు. ముఖ్యంగా ఎంఎస్ ధోనీ (MS Dhoni) కెప్టెన్సీలో జహీర్ అంతర్జాతీయ క్రికెట్ ఆడటం వల్ల, ధోనీతో ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ కారణంగానే సీఎస్‌కే జట్టులో జహీర్ నియామకం వెనుక ధోనీ సిఫారసు కూడా ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, సీఎస్‌కే ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) సారథ్యంలో జహీర్ ఖాన్ వ్యూహాలు జట్టును మళ్లీ విజయాల బాట పట్టించడంలో ఎంతవరకు సఫలమవుతాయనేది ఆసక్తికరంగా మారింది.

గత కొన్ని సీజన్లుగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఎల్లో ఆర్మీ(Yellow Army) వచ్చే ఐపీఎల్ 2027 సీజన్ కోసం పూర్తిగా కొత్త వ్యూహాలతో సిద్ధమవుతోంది. యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో, ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్‌ను మెరుగుపరచడంలో జహీర్ ఖాన్‌కు ప్రత్యేక నైపుణ్యం ఉంది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో యువ పేసర్లకు శిక్షణ ఇచ్చిన అనుభవం ఉన్న జహీర్, ఇప్పుడు చెన్నై జట్టులోని పేస్ అటాక్‌ను మరింత పటిష్టం చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. కొత్త కోచ్ రాకతో చెన్నై జట్టు మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుని ట్రోఫీ రేసులో నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *