Headlines

తెలుగులో తొలి గ్లామర్ హీరో.. భారీ రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి నటుడు కూడా ఈయనే


తెలుగు సినిమా తొలి దశాబ్దాలు, ముఖ్యంగా 1940ల కాలం, సినీ చరిత్రలో ఒక స్వర్ణయుగం. ఈ కాలంలో చక్రం తిప్పిన ముగ్గురు కథానాయకులు చిత్తూరు వి. నాగయ్య, ఈలపాట రఘురామయ్య,అలాగే చదలవాడ నారాయణరావు. వీరిలో చదలవాడ నారాయణరావుకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయనను తెలుగు సినిమా తొలి గ్లామర్ హీరోగా, స్టైలిష్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈలపాట రఘురామయ్య 1933లో పృథ్వీపుత్ర సినిమాతో ప్రవేశించి దాదాపు 100 చిత్రాల్లో నటించారు. భక్త రామదాసు నాటకంలో రఘురాముని పాత్రను అద్భుతంగా పోషించినందుకు కాశీనాధుని నాగేశ్వరరావుచే రఘురామయ్యగా నామకరణం పొందారు. ఆయన ఈలపాటలో ఘనుడు. చిత్తూరు వి. నాగయ్య భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా, లక్ష రూపాయల పారితోషికం అందుకున్న మొదటి నటుడిగా, తొలి పద్మశ్రీ పురస్కార గ్రహీతగా చరిత్రకెక్కారు. ఆయన నటుడే కాదు, రచయిత, సంగీత దర్శకుడు, గాయకుడు, నిర్మాత, దర్శకుడు కూడా.

బిందాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మతిపోవాల్సిందే.. ఇప్పుడు ఎలా ఉందంటే

ఈ దిగ్గజాల సరసన నిలిచిన సి హెచ్ నారాయణరావు గురించి చాలామందికి తెలియదు. నాటకానుభవం లేకపోయినా, ఎవరి సిఫార్సు లేకుండానే హీరో పాత్రకు ఎంపికైన తొలి నటుడు ఆయనే. మిర్జాపురం రాజా వారు నిర్మించిన జీవనజ్యోతి చిత్రంలో కృష్ణవేణి కథానాయికగా నటించారు. ఆ రోజుల్లో జమీందారు స్థాయి సంపాదనగా పరిగణించబడే వంద రూపాయల పారితోషికం తీసుకున్న తొలి నటుడు కూడా నారాయణరావే. జీవనజ్యోతి విజయవంతం కావడంతో నారాయణరావుకు అవకాశాలు వెల్లువెత్తాయి. దాదాపు దశాబ్దం పాటు గ్లామర్ హీరోగా, విలన్‌గా వెలుగొందారు. ఎన్.టి. రామారావు తొలి చిత్రం మనదేశంలో నాగయ్య తమ్ముడిగా హీరో పాత్రలో నటించారు. భక్తపోతనలో శ్రీరాముడి పాత్రతో ప్రేక్షకులను పరవశింపజేశారు. మొదటిరాత్రి, ముగ్గురు మరాఠీలు, జీవితం, స్వర్గసీమ వంటి అనేక చిత్రాల్లో నటించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకులు ఏలుతున్న కాలంలో అడుగుపెట్టిన నారాయణరావు స్టార్‌డమ్ అనే పదాన్ని హీరోలకు వర్తింపజేసి, అభిమాన సంఘాలు ప్రారంభం కావడానికి కారణమయ్యారు.

ఆ డైరెక్టర్ అందరి ముందు లాగిపెట్టి కొట్టారు.. ఆ తర్వాత ఆ తప్పు చేయలేదు : బాలాదిత్య

ఆయన వేషధారణ, ముఖ్యంగా మొదటిరాత్రి చిత్రంలో ధరించిన అడ్డగళ్ల చారల బనీను ఆ రోజుల్లో యువతకు ఫ్యాషన్‌గా మారింది. నారాయణరావు క్రాఫ్, నడక, డ్రసింగ్ ఫాలో అవ్వడం ఒక అలవాటుగా ఉండేది. ఆయన చక్కని ఇంగ్లీషు మాట్లాడేవారు, పాత్రకు తగ్గట్టు సహజ అభినయం చేయాలని చెప్పేవారు. పారితోషికం విషయంలో చాలా కచ్చితంగా ఉండేవారు. దిలీప్ కుమార్, రాజ్ కపూర్, బలరాజ్ సహానీ వంటి బాలీవుడ్ నటులు మద్రాస్ వచ్చినప్పుడు నారాయణరావుని తప్పకుండా కలిసేవారు.అయితే, అక్కినేని నాగేశ్వరరావు బిజీ అవ్వడం, ఎన్.టి. రామారావు రంగప్రవేశం చేయడంతో నారాయణరావుకు పోటీ పెరిగి అవకాశాలు క్రమంగా తగ్గాయి. 1958 నుండి ఏడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. వీలునామా, రహస్యం వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించారు. తన తొలి చిత్రం మానవతిలో హీరోగా నటించిన నారాయణరావుకు, రహస్యం చిత్ర నిర్మాత శంకర్ రెడ్డి చిన్న వేషం ఇచ్చి ఆదుకున్నారు. ముగ్గురు మరాఠీలు చిత్రంలో అక్కినేని అన్నదమ్ములుగా నటించిన నారాయణరావు, తర్వాత అక్కినేని హీరోగా నటించిన సినిమాలో చిన్న పాత్ర చేయాల్సి వచ్చింది. తన తొలి రోజుల్లో నారాయణరావు దగ్గర నటనలో మెళకువలు నేర్చుకున్న కృష్ణంరాజు, ఆయన చివరి రోజుల్లో శివమెత్తిన సత్యం, మధుర స్వప్నం వంటి తన చిత్రాల్లో అవకాశాలు కల్పించి గురు రుణం తీర్చుకున్నారు. 1982లో వచ్చిన మధుర స్వప్నం ఆయన చివరి సినిమా. మూత్రపిండాల వ్యాధితో బాధపడిన నారాయణరావు 1984 ఫిబ్రవరి 14న మద్రాసులో కన్నుమూశారు.

ఇవి కూడా చదవండి



ఓ సీన్ కోసం ఆ స్టార్ హీరో ఉతకాని, వాసనొస్తున్న సూట్‌ వేసుకున్నారు: దేవి ప్రసాద్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *