Headlines

గంటల తరబడి ఇయర్ ఫోన్లు వాడినా చెవి నొప్పి ఉండదట.. సోనీ లింక్ బడ్స్ క్లిప్ లో అసలు విశేషం ఇదే!


పాటలు వింటూనే చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకునేవారికి ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ ఉపయోగపడతాయి. ఈ మోడల్ కూడా అదే విధానాన్ని కొనసాగిస్తుంది. చెవిలోపలికి చొప్పించకుండా క్లిప్‌లా అమర్చుకోవడం దీని ప్రత్యేకత. ఆఫీస్‌లో పని చేస్తున్నా, బయట నడుస్తున్నా, రన్నింగ్ చేస్తున్నా పరిసరాల శబ్దాలను వింటూనే సంగీతాన్ని ఆస్వాదించవచ్చు.

చెవికి క్లిప్‌లా..

ఈ ఇయర్‌బడ్స్‌లో ప్రధాన ఆకర్షణ డిజైన్. సాధారణ బడ్స్‌లా చెవి లోపలికి పెట్టాల్సిన అవసరం లేదు. చెవి బయటి భాగంలో క్లిప్‌లా అమర్చుకోవచ్చు. దీనివల్ల చెవిపై ఒత్తిడి తగ్గుతుంది. ఎక్కువసేపు పాటలు వినే వారికి ఈ రూపకల్పన సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా బయట రన్నింగ్ చేసేటప్పుడు పరిసరాల శబ్దాలు వినిపించడం ఉపయోగపడుతుంది.

సౌండ్ విషయానికి వస్తే ఓపెన్ డిజైన్ అయినప్పటికీ స్పష్టమైన వోకల్స్ అందించేలా రూపొందించారు. అయితే బలమైన బేస్ కోరుకునేవారికి ఇది అంతగా నచ్చకపోవచ్చు. బయట శబ్దాలు కొంతవరకు వినిపిస్తాయి కాబట్టి నిశ్శబ్ద ప్రదేశాల్లో సంగీతాన్ని ఆస్వాదించడం మరింత బాగుంటుంది. కాల్స్ సమయంలో మైక్ పనితీరు స్పష్టంగా ఉంటుందని సమాచారం.

బ్యాటరీ, కనెక్టివిటీ..

బ్యాటరీ విషయంలో సింగిల్ ఛార్జ్‌తో మంచి బ్యాకప్ అందించేలా ఈ మోడల్‌ను రూపొందించారు. ఛార్జింగ్ కేస్‌తో కలిపి రోజువారీ అవసరాలకు సరిపడే బ్యాకప్ లభిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉండటంతో తక్కువ సమయంలోనే అవసరమైనంత ఛార్జ్ చేసుకోవచ్చు.

బ్లూటూత్ కనెక్షన్ వేగంగా ఏర్పడటంతో పాటు స్థిరంగా ఉండేలా ఉంది. ఫోన్‌తో సులభంగా జత చేసుకోవచ్చు. అయితే ఈ మోడల్ ధర సాధారణ ఇయర్‌బడ్స్‌తో పోలిస్తే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నాయిస్ క్యాన్సలేషన్, బలమైన బేస్ కోరుకునేవారికి ఇది సరైన ఎంపిక కాకపోవచ్చు. చెవుల్లో బడ్స్ పెట్టుకోవడం ఇష్టం లేని వారు, ఎక్కువసేపు సౌకర్యంగా సంగీతం వినాలనుకునేవారు, పరిసరాల శబ్దాలపై దృష్టి ఉంచేవారికి ఈ ప్రత్యేకమైన డిజైన్ ఆకట్టుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *