Headlines

90 రోజులు.. రూ.1000 కోట్లు.. అగ్నిపరీక్ష..!


2026 ఫస్టాఫ్ అంతా డిజాస్టరే.. ఒక్క సంక్రాంతి సినిమాలు తప్ప మళ్లీ ఆర్నెళ్ల వరకు విజయం అనే మాటే వినిపించలేదు. కానీ సెకండాఫ్ మొదలయ్యాకే బయ్యర్లు మళ్లీ ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో తొలి మూడు నెలలు కూడా బాగానే గడిచాయి. మరి మలి మూన్నెళ్ల పరిస్థితేంటి..? నెక్ట్స్ 3 మంత్స్ టాలీవుడ్‌కు ఎలా ఉండబోతుంది..? ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి..? 2026 సెకండాఫ్ ఇప్పటి వరకైతే బాగానే ఉంది. జులై టూ సెప్టెంబర్ వరకు చాలా విజయాలే పలకరించాయి. ఇరుముడి లాంటి సినిమాలు ఇండస్ట్రీ రికార్డులు సైతం తిరగరాసాయి. ఇప్పుడందరి ఫోకస్ రాబోయే మూన్నెళ్లపై ఉంది. అందులో ముందుగా సెప్టెంబర్ 24న నాని ‘ది ప్యారడైజ్’ రానుంది. నెక్ట్స్ టాలీవుడ్‌లో పెద్ద రిలీజ్ అదే. ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయితే 200 కోట్ల రేంజ్ ఉన్న సినిమా ఇది. ప్యారడైజ్‌తో సెప్టెంబర్ ముగిసినా.. లాస్ట్ 3 మంత్స్ గేమ్ అక్టోబర్‌లోనే మొదలు కానుంది. అక్టోబర్ టూ డిసెంబర్ తెలుగు స్ట్రెయిట్ సినిమాలతో పాటు పెద్ద పెద్ద డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి. ఆ 3 మూడు నెలల్లో రాబోయే సినిమాలే 2026 ఫేట్ ఏంటో చెప్తాయి. అక్టోబర్ 2న ఆదర్శ కుటుంబంతో పాటు డోంట్ ట్రబుల్ ది ట్రబుల్, సిగ్మా సినిమాలు విడుదలవుతున్నాయి. వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2న వస్తుందా లేదంటే వారం ఆలస్యంగా రానుందా అనేది ప్యారడైజ్ రిలీజ్ తర్వాత తేలనుంది. అలాగే అక్టోబర్ మూడో వారంలో దసరా కానుకగా 15న జైలర్ 2తో రజినీకాంత్ రానున్నారు.. ఆయనకు పోటీగా 16నే విజయ్ దేవరకొండ రణబాలి, ధనుష్ ఓం సినిమాలు విడుదల కానున్నాయి. అక్టోబర్‌ను డిసైడ్ చేసే సినిమాలివే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారీగా పెరగనున్న బియ్యం, చక్కెర ధరలు

కవల పిల్లల తల్లి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి!

ఇండిగో బాదుడు.. దేశీయ విమాన ప్రయాణం మరింత భారం

చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..

PM Modi: 76 ఏళ్ల వయసులో ఇంత యాక్టివ్ గా ఎలా? మోదీ హెల్త్ సీక్రెట్ ఇదే



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *