Headlines

Bigg Boss10 Telugu: బిగ్ బాస్ ఇంట్లో రెండో ఎలిమినేషన్.. ఆ కంటెస్టెంట్ అవుట్..


బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయినట్లు సమచారం. మొదటి వారంలో చరణ్, చైత్ర రాయ్ ఎలిమినేట్ కాగా, ఈ రెండో వారంలో నటుడు ‘కృష్ణుడు’ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి కృష్ణుడు చాలా కూల్‌గా, చిల్‌గా కనిపిస్తూ వచ్చారు. షోలో నిరూపించుకోవడానికి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో ఆయన విఫలమయ్యారని విమర్శలు వచ్చాయి. మొదటి వారంలో అక్కడక్కడా కనిపించినా, రెండో వారంలో మాత్రం ఆటలోనూ, మాటల్లోనూ ఎక్కడా షైన్ అవ్వలేకపోయారు. ఫిజికల్ టాస్కుల్లో కాస్త ఇబ్బంది పడుతూ, షోకి కాకుండా వెకేషన్‌కి వచ్చినట్లుగా ప్రవర్తించారని ప్రేక్షకులు భావించారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..

ఇటీవల జరిగిన ‘గార్డ్ టాస్క్’లో హౌస్‌మేట్స్ అందరూ పోటీపడుతుంటే, కృష్ణుడు మాత్రం గూర్ఖాలా విజిల్స్ వేస్తూ చుట్టూ తిరగడం కనిపించింది. దీంతో మొదటి రౌండ్‌లోనే వంశీ, రోహిత్‌లు ఆయనను పక్కన పెట్టేశారు. అంతేకాకుండా, వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున కూడా కృష్ణుడు, శ్రిష్టిలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో ఏమీ చేయకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారంటూ వారిద్దరిని దూరంగా మూలన కూర్చోబెట్టారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..

ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న 11 మందిలో రోహిత్, ముకేష్ గౌడ ఓటింగ్‌లో టాప్‌లో దూసుకెళ్లగా.. కృష్ణుడు, శ్రిష్టి, సుధీర్ లీస్ట్ స్థానాల్లో నిలిచారు. అన్ని ఆన్‌లైన్ పోల్స్‌లోనూ కృష్ణుడికే అత్యల్ప (కేవలం 2 శాతం) ఓట్లు నమోదయ్యాయి. ఆయన ఆట వల్ల హౌస్‌కి ఎలాంటి ఉపయోగాలు లేవని భావించిన ఆడియన్స్ ఆయనకు ఓట్లు వేయడానికి ఆసక్తి చూపించలేదు. దాంతో అనధికారిక సమాచారం ప్రకారం, ఈ రెండో వారంలో అందరికంటే తక్కువ ఓటింగ్ సాధించిన కృష్ణుడిని బిగ్ బాస్ మేకర్స్ ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రసారం ఆదివారం నాటి ఎపిసోడ్‌లో ప్రసారం కానుంది.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *