INDW vs BANW Result: ఆసియా క్రీడల మహిళల క్రికెట్ సెమీ-ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 195 పరుగులు చేసింది. అనంతరం 196 లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ టీం కేవలం 15 ఓవర్లలో ఆలౌట్ అయింది. దీంతో భారత జట్టు ఆసియా గేమ్స్ 2026 ఫైనల్‌కు చేరుకుంది. ఇక ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకతో గోల్డ్ మెడల్ కోసం పోరాడనుంది.
భారత్ తరపున, షెఫాలీ వర్మ 49 బంతుల్లో 9 సిక్స్‌లు, 3 ఫోర్లతో అజేయంగా 100 పరుగులు చేసింది. ఆమె హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి మూడో వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.