Headlines

ఐపీఎల్ 2027 మినీ వేలానికి రంగం సిద్ధం.. ఎప్పుడు, ఎక్కడంటే..?


IPL Mini Auction 2027: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆధ్వర్యంలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League, IPL) తదుపరి సీజన్ మినీ వేలం కోసం ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్ 2027 మినీ వేలంపై కీలక అప్డ్‌ట్ వచ్చింది. క్రిక్‌ఇన్ఫో వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం, ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు నిర్వహించే మినీ వేలం డిసెంబర్ రెండో వారంలో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గత 3 సీజన్లుగా దుబాయ్, జెడ్డా, అబుదాబి నగరాల్లో విదేశీ గడ్డపై జరిగిన ఈ వేలం, ఇప్పుడు మళ్లీ స్వదేశానికి చేరింది. బోర్డు అధికారికంగా ఖచ్చితమైన తేదీలను ఇంకా ప్రకటించనప్పటికీ, డిసెంబర్ 7 నుంచి 13 తేదీల మధ్య ఈ ఈవెంట్ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుత సైకిల్‌లో జరగబోయే చివరి మినీ వేలం ఇదే కావడం గమనార్హం.

ఈ వేలాన్ని దేశంలో నిర్వహించనుండటంతో వేదికపై కసరత్తు జరుగుతోంది. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ (Arun Dhumal) వివరాల ప్రకారం, హోటల్ వేకెన్సీపై వేదిక ఎక్కడనేది ఫిక్స్ చేస్తామంటూ తెలిపారు. డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ పీక్స్‌లో ఉండటం దీనికి ప్రధాన కారణం అని తెలిపారు. 10 ఫ్రాంచైజీల కోసం వందకు పైగా గదులను కేటాయించాల్సిన అవసరం ఉండటంతో, హోటల్ వసతులు పూర్తిగా పరిశీలించిన తరువాతే బోర్డు తుది వేదికను ఖరారు చేయనుంది. ఆ తరువాతే నగరంతో పాటు పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు.

ఈసారి జరగబోయేది మినీ వేలం కావడంతో ఫ్రాంచైజీలు తమ పాత జట్లను చాలావరకు అలాగే అట్టేపెట్టుకునే అవకాశం ఉంది. జట్ల వద్ద ఉండే పర్సు విలువ, రిటెన్షన్ ప్రక్రియ, ట్రేడింగ్ విండో ముగిసిన తరువాతే అసలైన లెక్కలు బయటికి వస్తాయి. 2027 సీజన్ కోసం ప్రతి జట్టూ 120 కోట్ల రూపాయల బేస్‌లైన్ పర్సును కలిగి ఉండగా, మొత్తం సాలరీ క్యాప్ 157 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు.

అయితే ఆటగాళ్ల కొనుగోలుకు ఉండే తుది బడ్జెట్ మాత్రం జట్లు రిలీజ్, రిటైన్ చేసిన ఆటగాళ్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కొనసాగింపుపై గవర్నింగ్ కౌన్సిల్ ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *