Headlines

ఈ 3 మీ రోజును పాడుచేసే మార్నింగ్‌ అలవాట్లు! ఈ తప్పులు అస్సలు చేయకండి!


ఉదయాన్నే మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు రోజంతా మన ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఈ పొరపాట్లను సరిదిద్దుకోవడం ద్వారా రోజంతా రోజంతా ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండవచ్చు. అలాంటి మార్నింగ్‌ మిస్టేక్స్‌ ఏంటి..? వాటి నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు చూద్దాం..

అలారం స్నూజ్ చేయడం, హఠాత్తుగా మంచం దిగడం

ఉదయాన్నే అలారం మోగగానే దాన్ని నిలిపివేసి మరో ఐదు నిమిషాలు పడుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శరీరం మళ్లీ నిద్ర చక్రంలోకి వెళ్తుంది. దీనివల్ల లేచిన తర్వాత కూడా శరీరం మరింత అలసటగా, మత్తుగా అనిపిస్తుంది. అలాగే నిద్రలేవగానే మంచం నుంచి హఠాత్తుగా వేగంగా లేచి నిలబడకూడదు. ఎనిమిది గంటల పాటు ప్రశాంతంగా ఉన్న శరీరం ఒక్కసారిగా లేవడం వల్ల గురుత్వాకర్షణ ప్రభావంతో రక్తప్రసరణ కాళ్ల వైపు వెళ్లి, రక్తపోటు తగ్గి మైకం వచ్చే అవకాశం ఉంటుంది.

పరగడుపున టీ లేదా కాఫీ తాగడం

మనదేశంలో ఉదయాన్నే వేడివేడి టీ లేదా కాఫీతో రోజును ప్రారంభించడం సాధారణం. అయితే పరగడుపున టీ/కాఫీలు తాగడం వల్ల అందులో ఉండే యాసిడ్లు కడుపులోని ఆమ్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఇది ఎసిడిటీ, వాంతులు, డీహైడ్రేషన్‌కి దారితీస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ముందుగా గోరువెచ్చని నీరు తాగడం, ఆ తర్వాత ఏదైనా పండు తిని 15-20 నిమిషాల తర్వాతే టీ/కాఫీలు తీసుకోవడం శ్రేయస్కరం.

ఇవి కూడా చదవండి



నిద్రలేవగానే ఫోన్ చూడటం, బ్రేక్‌ఫాస్ట్ మానేయడం

కళ్లు తెరవగానే చేతిలోకి స్మార్ట్‌ఫోన్ తీసుకుని సోషల్ మీడియా లేదా ఈమెయిల్స్ చూడటం వల్ల మెదడుపై ఒక్కసారిగా తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఇది రోజంతా దృష్టి కేంద్రీకరించే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. దీనితో పాటు ఉదయపు టిఫిన్ మానేయడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోయి రోజంతా నీరసం, సోమరితనం ఆవరిస్తాయి.

ఈ చిన్నచిన్న మార్పులను మీ దినచర్యలో చేర్చుకోవడం ద్వారా ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన, ఉత్సాహభరితమైన రోజంతా మీసొంతం చేసుకోవచ్చు!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *