Headlines

Chiranjeevi: మెగాస్టార్‌కు పడాల్సిన బ్లాక్ బస్టర్.. మిస్ అయ్యి ఆ హీరో కొట్టేశారు..!


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇటీవలే మనశాంకర వరప్రసాద్ గారు సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు చిరు. ఇక ఇప్పుడు రెండు సినిమాలను లైనప్ చేశారు. వాటిలో ఒకటి ఎప్పటినుంచో సాగుతున్న విశ్వంభర. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా కాలంగా సాగుతుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అలాగే మరో సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కితున్న కాకా. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే చిరంజీవి ఓ బ్లాక్ బస్టర్ సినిమా మిస్ చేసుకున్నారట. ఆ సినిమాను సూపర్ స్టార్ రజినీకాంత్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారట. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.?

Aditi Myakal : మేడమ్ సార్ మేడమ్ అంతే..! మెంటలెక్కిస్తున్న అర్జున్ రెడ్డి భామ

మలయాళ క్లాసిక్ ‘మణిచిత్రతాళు’ విషయంలో జరిగింది. ఈ కథను తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించాలనే ఆలోచన ఒక దశలో ఉండగా.. ఆయన ఆసక్తి చూపకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదట. ఆ తర్వాత ఇదే కథలో కీలక మార్పులు చేసి తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌తో చంద్రముఖిగా తెరకెక్కించారు. 1993లో దర్శకుడు ఫాజిల్ రూపొందించిన ‘మణిచిత్రతాళు’ మలయాళ సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. హారర్, సైకలాజికల్ థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా అంశాలను కలగలిపి రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.. కట్ చేస్తే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది

మోహన్‌లాల్, శోభన, సురేష్ గోపీ తదితరులు నటించిన ఈ చిత్రం కథనం, పాత్రల చిత్రణ, మిస్టరీ, క్లైమాక్స్ కారణంగా క్లాసిక్‌గా నిలిచిపోయింది. ముఖ్యంగా సినిమాలోని మానసిక పరిస్థితులను చూపించిన తీరు అప్పట్లో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. మణిచిత్రతాళు విజయం తర్వాత ఈ కథను తెలుగులోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరిగాయి. దర్శకుడు వి.ఎన్. ఆదిత్య ఈ కథను మెగాస్టార్ చిరంజీవితో రీమేక్ చేయాలనే ఆలోచనతో ఆయనను సంప్రదించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. మలయాళంలో మోహన్‌లాల్ పోషించిన సైకియాట్రిస్ట్ పాత్రను తెలుగులో చిరంజీవితో చేయించాలని భావించారు. కథను చిరంజీవికి వివరించినప్పుడు ఆయన కథలోని ప్రత్యేకతను అర్థం చేసుకున్నప్పటికీ.. తన అప్పటి స్టార్ ఇమేజ్‌కు ఈ సినిమా ఎంతవరకు సరిపోతుందనే విషయంలో సందేహాలు వ్యక్తమైనట్లు సమాచారం. అప్పట్లో చిరంజీవి సినిమాలంటే ప్రేక్షకులు భారీ స్థాయిలో కమర్షియల్ అంశాలను ఆశించేవారు. హీరో ఇంట్రడక్షన్, యాక్షన్ సన్నివేశాలు, పాటలు, డ్యాన్సులు, పవర్‌ఫుల్ డైలాగులు వంటి అంశాలు ఆయన సినిమాల్లో కీలకంగా ఉండేవి. అయితే ‘మణిచిత్రతాళు’ కథ మాత్రం పూర్తిగా భిన్నమైనది. కథలో అసలు మిస్టరీ మహిళా పాత్ర చుట్టూనే తిరుగుతుంది. హీరో పాత్ర కంటే సినిమాలో మిస్టరీ మహిళ పాత్రే ఎక్కువ హైలెట్ అవుతుంది. దాంతో ఈ సినిమా మెగాస్టార్ చేయలేదు. దాంతో ఈ కథ దర్శకుడు పి. వాసు దృష్టికి వెళ్లింది. అయితే ఆయన దాన్ని యథాతథంగా రీమేక్ చేయకుండా.. తమిళ ప్రేక్షకుల అభిరుచికి, ముఖ్యంగా రజనీకాంత్ స్టార్ ఇమేజ్‌కు అనుగుణంగా కథనంలో అనేక మార్పులు చేశారు. 2005లో ‘చంద్రముఖి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు, వడివేలు తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది.

ఇవి కూడా చదవండి



అప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. కట్ చేస్తే మాజీ సీఎం భార్య.. ఇద్దరి మధ్య 27ఏళ్ల ఏజ్ గ్యాప్

Chandramukhi

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *