Headlines

Video: ప్రాణం తీసే కొండచిలువకే ప్రాణం పోశాడు.. ఈ వీడియో చూస్తే..


Video: ప్రాణం తీసే కొండచిలువకే ప్రాణం పోశాడు.. ఈ వీడియో చూస్తే..

కొండచిలువ పేరు వింటేనే గుండెల్లో దడ పుడుతుంది. అలాంటిది అడుగుల కొద్దీ పొడవున్న భారీ కొండచిలువ ఎదురుపడితే ఎవరైనా ఆమడదూరం పరుగులు తీస్తారు. కానీ ఓ యువకుడు మాత్రం కలలో కూడా ఊహించని సాహసానికి ఒడిగట్టాడు. బావిలో పడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న భారీ కొండచిలువను కాపాడేందుకు ఏకంగా లోతైన బావిలోకి దిగి ప్రాణాలకు తెగించాడు. ప్రస్తుతం నెట్టింట ఒళ్లు గగుర్పొడిచే ఈ రెస్క్యూ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రకారం.. లోతైన బావిలోని నీటి గుంట వద్ద ప్రమాదవశాత్తు ఒక భారీ కొండచిలువ చిక్కుకుపోయింది. అది బయటకు రాలేక విలవిల్లాడుతుండటాన్ని గమనించిన ఒక యువకుడు, దానిని రక్షించాలని నిర్ణయించుకున్నాడు. బావి అడుగుభాగానికి దిగి కొండచిలువను చేతులతో బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. అయితే దగ్గరకు వెళ్లి పరిశీలించగానే దాని భారీ ఆకారం, ఊహకందని పొడవు, బరువు చూసి ఆ యువకుడు కొన్ని క్షణాల పాటు నిశ్చేష్టుడయ్యాడు. కాస్త పట్టు తప్పినా ఆ కొండచిలువ చుట్టేసేంత ప్రమాదం పొంచి ఉండటంతో ఆపరేషన్ అత్యంత క్లిష్టంగా మారింది.

అయినా ఏమాత్రం భయపడకుండా, పూర్తి సంయమనంతో ఆ యువకుడు కొండచిలువ తోక భాగాన్ని గట్టిగా పట్టుకుని నెమ్మదిగా లాగడం మొదలుపెట్టాడు. ఆ యువకుడి పట్టు నుంచి తప్పించుకునేందుకు ఆ భారీ కొండచిలువ తన సర్వశక్తులూ ఒడ్డి మెలికలు తిరుగుతూ పోరాడింది. ఒకవైపు నిలబడటానికే వీల్లేని బావి అడుగుభాగంలో సమతుల్యత కాపాడుకోవడం, మరోవైపు ఎటునుంచి దాడి చేస్తుందో తెలియని భారీ సర్పం.. వెరసి క్షణక్షణం ఉత్కంఠ రేపింది.

ప్రాణాల మీద ఆశ వదలకుండా ఆ యువకుడు ప్రదర్శించిన అసమాన ధైర్యం, సహనంతో కొండచిలువను సురక్షితంగా బావి నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఈ దృశ్యాలను అక్కడున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ప్రాణాలకు తెగించి ఓ మూగజీవాన్ని కాపాడిన ఆ యువకుడి అద్భుతమైన ధైర్యసాహసాలను చూసి నెటిజన్లు ఫిదా అవుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వీడియో చూడండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *