Headlines

Andhra Pradesh: రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కొత్త రూల్స్.. ఏపీ ప్రజలకు ప్రభుత్వం బిగ్ అలర్ట్.. ఇకపై అక్కడ మాత్రమే..


ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ల జారీలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కొత్తగా జీవో నెంబర్ 592ను ప్రభుత్వం విడుదల చేసింది. 2015లో తెచ్చిన జీవో 581ను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి తహసీల్దార్‌కు రెసిడెన్స్ సర్టిఫికేట్ జారీ చేసే అధికారాన్ని అప్పగించింది. ఇక నుంచి ఎవరికైనా నివాస ధృవీకరణ పత్రం అవసరమైతే తహసీల్దార్‌కు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. తహసీల్దార్ డాక్యుమెంట్లు పరిశీలించి సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఒకవేళ సరైన ఆధారాలు లేకపోతే స్థానికంగా విచారణ జరిపిన అనంతరం రెసిడెన్స్ సర్టిఫికేట్ జారీ చేయాలని ప్రభుత్వం తెలిపింది. విద్య, ఓటర్ జాబితా సవరణ, ఉద్యోగులు, ఆధార్ నమోదు కోసం రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది చాలా అవసరం. ఈ క్రమంలో ప్రభుత్వం తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

గతంలో ఆధార్, రేషన్ కార్డులను నివాస రుజువుగా ఉపయోగించాలని ఆదేశించిన ప్రభుత్వం.. రెసిడెన్స్ సర్టిఫికేట్లను జారీ చేసే బాధ్యత నుంచి తహసీల్దార్లను తప్పించింది. ఇందుకోసం జీవో 581ను జారీ చేసింది. ఆప్పుడు ఈ జీవోను రద్దు చేసిన ప్రభుత్వం.. తిరిగి తహసీల్దార్లు జారీ చేసే ప్రక్రియను పునరుద్దరించింది. ఏపీలో సర్ ప్రక్రియ ముగియడం, రేషన్, ఆధార్ కార్డు ఆధారంగా నివాస రుజువును ధృవీకరిస్తున్న తరుణంలో రెసిడెన్స్ సర్టిఫికేట్లతో పని లేకుండా పోయింది. ఇప్పుడు ఆ బాధ్యతలను తిరిగి తహసీల్దార్లకు అప్పగించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటినుంచి ఈ సర్టిఫికేట్ల కోసం మళ్లీ తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుందా అనే ప్రశ్నలు ప్రజల్లో వస్తున్నాయి. అయితే అలాంటి పని లేదని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కన్ ప్యూజన్ నెలకొంది. ఇప్పటివరకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వీటిని జారీ చేస్తున్నారు. లేదా మీ సేవా కేంద్రాల ద్వారా కూడా అప్లై చేసుకుని పొందవచ్చు. ప్రభుత్వం మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించింది. దీని ద్వారా అయిదా పొందవచ్చు.

ఇప్పటివరకు ఆన్ లైన్ ద్వారా రెసిడెన్స్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకుని పొందే అవకాశముంది. ఇప్పుడు తహసీల్దార్‌కు బాధ్యతలు అప్పగించడంతో ఏమైనా మార్పులు ఉంటాయా అనే చర్చ నడుస్తోంది. అటు కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలకు ఆధార్ తప్పనిసరి కాదని తెలిపింది. ఆధార్ లేకపోయినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాయితీలు అందించాలని తెలిపింది. ఈ మేరకు తాజాగా దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *