Headlines

Property Rights: తండ్రి జీవించి ఉండగానే ఆస్తిలో కూతురు వాటా అడగొచ్చా..? ఈ నిబంధనలు తెలిస్తే ఆస్తి వివాదాలే ఉండవ్..


దేశంలో కుటుంబసభ్యుల మధ్య ఆస్తి వివాదాలు సాధారణంగా తలెత్తుతుంటాయి. ముఖ్యంగా తండ్రి ఆస్తికి సంబంధించి కూతురు వాటా విషయంలో గొడవలు జరుగుతుంటాయి. ఆస్తి మొత్తం కుమారుడికే అప్పగించడం వల్ల కూతురు వివాదానికి దిగడం, కోర్టు కేసుల వరకు వెళ్లడం మనం తరచూ చూస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఈ వివాదాలు తారాస్థాయికి చేరుకుని పెద్ద గొడవకు దారితీస్తాయి. అయితే చట్టాలపై అవగాహన లేకపోవడం వల్లనే ఆస్తి వ్యవహారాల్లో గొడవలు వస్తుంటాయి. ఎవరికి ఎంత ఆస్తి ఇవ్వాలి? కూతురికి ఎంత వాటా ఉంటుంది..? అనే అంశాలు చట్టంలో స్పష్టంగా పొందుపర్చి ఉంటాయి. తండ్రి మరణించిన తర్వాత కుటుంబాల్లో ఎక్కువ ఆస్తి వివాదాలు బయటపడుతూ ఉంటాయి. తన వాటా ఇవ్వలేదని కూతుళ్లు కోర్టు మెట్టెక్కుతుంటారు. అయితే చాలామందిలో ఒక సందేహాం ఉంటుంది. తండ్రి బ్రతికుండానే ఆస్తిలో కూతురు వాటా అడగొచ్చా? అనే ప్రశ్న అనేకమందిలో ఉంటుంది. దీనికి సమాధానం ఇప్పుడు చూద్దాం.

తండ్రి బ్రతికుండగానే వాటా అడగొచ్చా?

తండ్రి బ్రతికుండగానే కూతురు ఆస్తిలో వాటా అడిగే హక్కు ఉంది. 2025 హిందూ వారసత్వ సవరణ చట్టం ప్రకారం.. తండ్రి ఆస్తిలో కుమారుడితో పాటు కుమార్తెకు సమానమైన వాటా ఉంటుంది. దీంతో కూతురు ఎప్పుడైనా తండ్రి ఆస్తిలో తన వాటా అడిగి తీసుకోవచ్చు. తండ్రికి వారసత్వంగా పూర్వీకుల నుంచి ఆస్తి సమకూరితే.. సంతానానికి పూర్తి హక్కు ఉంటుంది. అలాంటి ఆస్తులు తండ్రి విక్రయించాలన్నా పిల్లల అనుమతి తప్పనిసరి. ఇక పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిపై కుమారుడితో పాటు కుమార్తెకు సమానంగా వాటా దక్కుతుంది. తండ్రి జీవించి ఉండగానే కూతురు తన వాటా అడగొచ్చు. తండ్రి ఇచ్చేందుకు నిరాకరిస్తే.. చట్టపరంగా కుమార్తెలు ముందుకెళ్లవచ్చు. అదే పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి కాకుండా తండ్రి తన కష్టార్జితంతో సంపాదించిన ఆస్తి అయితే రూల్స్ మరోలా ఉంటాయి. సొంతగా సంపాదించిన ఆస్తిపై తండ్రికే పూర్తి అధికారులు ఉంటాయి. పిల్లల అనుమతి లేకుండానే విక్రయించుకోవచ్చు లేదా బహుమతిగా ఇవ్వొచ్చు. లేదా విల్లు ద్వారా కుమార్తె లేదా కుమారుడికి వచ్చేలా రాయవచ్చు. తండ్రి బ్రతికుండగానే ఈ ఆస్తిలో వాటా ఇవ్వాలని అడిగే హక్కు కుమార్తె లేదా కుమారుడికి ఉండదు. తండ్రి తన ఇష్టానుసారం ఎవరికైనా అప్పగించవచ్చు.

తండ్రి విల్లు రాయకుండా మరణిస్తే ఏమవుతుంది..?

తండ్రి విల్లు రాయకుండా మరణిస్తే.. అతడు సొంతగా సంపాదించిన ఆస్తి భార్య, కుమారుడు, కుమార్తెకు సమానంగా దక్కుతుంది. దీంతో బ్రతికుండానే విల్లు రాయడం ద్వారా భవిష్యత్తులో వారసుల మధ్య ఎలాంటి ఆస్తి వివాదాలు ఉండవు. కానీ చట్టాలపై అవగాహన లేకపోవడం వల్లనే కుటుంబాల్లో ఆస్తి వివాదాలు చోటుచేసుకుంటున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *