Headlines

Weather Report: రెండ్రోజుల్లో అల్పపీడనం.. ఈ రోజు తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?


గత రెండ్రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగురాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై సముద్ర మట్టానికి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని.. దీనితో పాటుగా అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం సెప్టెంబర్ 19 సాయంత్రం నాటికి ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. రాబోయే 3-4 రోజులలో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో వచ్చే వారం కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

ఈ రోజు వర్షాలు కురిసే జిల్లాలు

ముఖ్యంగా గురువారం17-09-26 అల్లూరి, పోలవరం, కృష్ణా, గుంటూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈదురుగాలులతో వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

తెలంగాణలో వర్షాలు

ఇక ఈ ఆవర్తనం ప్రభావంతో ఇటు తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వాతవారణ వాఖ తెలిపింది. అయితే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మధ్యహ్నం వరకు కొద్దిపాటి ఉష్ణోగ్రతలు, ఉక్కపోత ఉండొచ్చని.. మధ్యా్‌హ్నం తర్వాత, రాత్రి దక్షిణ, పశ్చిమ, మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాలలోని వివిధ ప్రాంతాలలో బలమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచానా వేసింది. రాబోయే 2-3 గంటల పాటు నల్గొండ, నాగర్‌కర్నూలు జిల్లాల్లో చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *