Headlines

IRCTC: హైదరాబాద్ నుంచి సూపర్ టూర్.. పూరీ, కోణార్క్, చిలికా సహా ప్రముఖ ప్రదేశాల సందర్శన


IRCTC ‘Oriental Odisha’ Tour Telugu: ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాలను ఒకే టూర్‌లో ఆస్వాదించాలనుకునే పర్యాటకులకు IRCTC ‘Oriental Odisha’ (SHA42) ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్‌ నుంచి విమాన ప్రయాణంతో ఈ టూర్ ప్రారంభమవుతుంది. 2026 డిసెంబర్ 3 నుంచి 7 వరకు 4 రాత్రులు, 5 రోజుల పాటు ఈ ప్యాకేజీ కొనసాగుతుంది. టూర్‌లో భాగంగా పూరీ, చిలికా సరస్సు, కోణార్క్, భువనేశ్వర్, జాజ్‌పూర్‌లోని బిరాజా దేవి శక్తిపీఠం, రత్నగిరి బౌద్ధ అవశేషాలు వంటి ప్రముఖ ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది.

టూర్ వివరాలు

  • డిసెంబర్ 3న ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌ నుంచి 6E 6242 విమానంలో బయలుదేరి 8:30 గంటలకు భువనేశ్వర్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి పూరీకి ప్రయాణిస్తారు. మార్గమధ్యంలో ధౌళి స్తూపాన్ని సందర్శించి పూరీలో బస చేస్తారు.
  • రెండో రోజు ఉదయం జగన్నాథ ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉంటుంది. అనంతరం సత్పాడకు వెళ్లి చిలికా సరస్సు అందాలను వీక్షిస్తారు. రాత్రి పూరీలోనే బస ఉంటుంది.
  • మూడో రోజు పూరీ నుంచి కోణార్క్‌కు బయలుదేరి ప్రసిద్ధ కోణార్క్ సూర్య దేవాలయం సందర్శిస్తారు. అనంతరం భువనేశ్వర్‌కు చేరుకుని రాత్రి బస చేస్తారు.
  • నాలుగో రోజు జాజ్‌పూర్‌లోని బిరాజా దేవి శక్తిపీఠం దర్శించుకుంటారు. తర్వాత రత్నగిరి బౌద్ధ అవశేషాలను సందర్శించి భువనేశ్వర్‌కు తిరిగి వస్తారు.
  • ఐదో రోజు లింగరాజ ఆలయం, ముక్తేశ్వర్ ఆలయం, రాజారాణి ఆలయం సందర్శిస్తారు. అనంతరం ఖండగిరి, ఉదయగిరి గుహలను చూసి భువనేశ్వర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 6:30 గంటలకు విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరి రాత్రి 8:25 గంటలకు చేరుకుంటారు.

ప్యాకేజీ ధరలు

ప్యాకేజీ ధరలు ఆక్యుపెన్సీ, వయసు ఆధారంగా మారుతాయి. ఒకరికి సింగిల్ ఆక్యుపెన్సీ రూ.42,100 నుంచి, డబుల్ ఆక్యుపెన్సీ రూ.32,900 నుంచి, ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ.30,700 నుంచి ప్రారంభమవుతాయి. మరో కేటగిరీలో సింగిల్ రూ.46,000, డబుల్ రూ.36,000, ట్రిపుల్ రూ.34,050గా ఉన్నాయి.

ప్యాకేజీలో విమాన టికెట్లు, హోటల్ వసతి, నాలుగు బ్రేక్‌ఫాస్ట్‌లు, నాలుగు డిన్నర్లు, ఏసీ బస్ ద్వారా స్థానిక ప్రయాణం, ట్రావెల్ ఇన్సూరెన్స్, టూర్ ఎస్కార్ట్ సేవలు, పన్నులు ఉంటాయి. మొత్తం 29 మంది పర్యాటకులతో ఈ టూర్ నిర్వహించనున్నారు. పూరీలో Sree Hari లేదా సమానమైన హోటల్, భువనేశ్వర్‌లో Swosti Resort లేదా సమానమైన వసతి కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి



గమనిక: విమాన సమయాలు, పర్యటన షెడ్యూల్ స్థానిక పరిస్థితులు లేదా నిర్వహణ కారణాల వల్ల మారవచ్చు. ప్యాకేజీకి వర్తించే నిబంధనలు, చేర్పులు-మినహాయింపులను బుకింగ్‌కు ముందు పరిశీలించాలి.

హైదరాబాద్ నుంచి ఒడిశా టూర్ ప్యాకేజీ బుకింగ్, మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *