India vw West Indies ODI Squad Announcement Live Updates: వెస్టిండీస్‌తో జరగబోయే 3 వన్డేల సిరీస్ కోసం భారత జట్టును నేడు ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం బీసీసీఐ ఉన్నతాధికారుల ఎంపిక సమావేశం జరుగుతోంది. ఓ నివేదిక ప్రకారం, ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఒప్పందం ఈ నెల చివరలో ముగిసిపోనుంది. ఇదే అగార్కర్ కు చివరి ఎంపిక సమావేశం కావొచ్చు. వెస్టిండీస్ సిరీస్ కోసం జరిపే ఈ ఎంపిక సమావేశమే తనకు చివరిది కావొచ్చని అగార్కర్ తనకు సన్నిహిత వర్గాలతో చెప్పినట్లు ఆ నివేదికలో పేర్కొంది. అగార్కర్ ఏడాది పాటు ఒప్పందాన్ని పొడిగించుకుంటారని ముందుగా భావించినా, అయితే, రోహిత్ శర్మ భవిష్యత్తుపై ఇటీవల తలెత్తిన వివాదాలు, బీసీసీఐ ఉన్నతాధికారుల మధ్య సంబంధాలు చెడినట్లుగా కనిపిస్తోంది. దీంతో ఇదే ఫైనల్ సెలక్షన్ కావొచ్చని చెబుతున్నారు.
1. రోహిత్ జట్టులో ఉంటాడా లేదా?
సెలక్షన్ గడువు సమీపిస్తున్న కొద్దీ రోహిత్ శర్మ భవిష్యత్తు కీలక చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లాండ్‌లో జరిగిన భారత చివరి వన్డే సిరీస్ సందర్భంగా, జట్టు తరపున రోహిత్‌కు అదే చివరిది కావొచ్చని పలు నివేదికలు పేర్కొన్నాయి. అయితే, సెలెక్టర్ల ప్రణాళికలలో ఉన్నంత కాలం రోహిత్ ఆడుతూనే ఉంటాడని చెబుతూ, బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా ఆ వాదనలను ఖండించిన సంగతి తెలిసిందే.