Headlines

IND vs WI: పంత్ ఇన్.. రోహిత్ అవుట్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియాలో భారీ మార్పులు


IND vs WI: పంత్ ఇన్.. రోహిత్ అవుట్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియాలో భారీ మార్పులు

IND vs WI: భారత క్రికెట్ జట్టు తదుపరి పోరుకు సన్నద్ధమవుతోంది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 17 వరకు వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ టూర్‌లో భాగంగా ముందుగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుండగా దీనికి సంబంధించిన జట్టును బీసీసీఐ ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇదే సమయంలో ఏషియన్ గేమ్స్ కూడా జరుగుతుండటంతో, టీ20 ఫార్మాట్‌లో ఆడే కొందరు కీలక ఆటగాళ్లు వన్డే జట్టుకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ లాంగ్ గ్యాప్ తర్వాత వన్డే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

వెస్టిండీస్ సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ సెలెక్టర్ల సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లో విండీస్ టూర్‌కు ఎంపికయ్యే వన్డే స్క్వాడ్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే మిడిలార్డర్ ముఖ్యంగా నాల్గవ స్థానంలో బ్యాటింగ్ చేసే శ్రేయస్ అయ్యర్ ఈ వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండడు. ప్రస్తుతం అతను ఏషియన్ గేమ్స్‌లో టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండటంతో ఈ సిరీస్‌ను కోల్పోనున్నాడు.

గత కొంతకాలంగా వన్డే జట్టులో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్‌కు మొదటి ప్రాధాన్యతగా ఉన్నాడు, విండీస్ సిరీస్‌లోనూ అతనే మెయిన్ కీపర్‌గా కొనసాగడం ఖాయం. అయితే ఇషాన్ కిషన్ ఏషియన్ గేమ్స్ బాధ్యతల్లో బిజీగా ఉండటంతో, బ్యాకప్ వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ స్థానం కోసం పంత్‌కు యువ ఆటగాడు ధ్రువ్ జురెల్ నుంచి గట్టి పోటీ ఎదురుకావచ్చు.

ఇంగ్లాండ్ పర్యటన సమయంలోనే రోహిత్ శర్మకు 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో తాను లేనని సెలెక్టర్లు స్పష్టం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే లార్డ్స్ లో రోహిత్ అద్భుతమైన సెంచరీ బాది తన సత్తా చాటాడు. ఇప్పుడు సెలక్షన్ మీటింగ్‌లో రోహిత్ సెలక్షన్ పై అందరి చూపు నిలిచింది. ఒకవేళ అతన్ని విండీస్ సిరీస్‌కు ఎంపిక చేస్తే.. 2027 వరల్డ్ కప్ వరకు అతను కొనసాగుతాడనే సంకేతాలు లభించినట్లే. మరోవైపు ఐపీఎల్ 2026 తర్వాత ఆటకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా గాయం కారణంగా విండీస్ వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఇక స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ తో కలిసి యుజ్వేంద్ర చహల్ మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది.

భారత్ వన్డే జట్టు(అంచనా )

శుభమన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, రిషబ్ పంత్, రజత్ పాటిదార్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *