Headlines

Train Ticket UPI Charge: కొత్త రూల్స్‌ తర్వాత యూపీఐ ద్వారా రైలు టిక్కెట్లు బుక్‌ చేస్తే ఎంత ఛార్జీ పడుతుంది?


Train Ticket UPI Charge: ఇకపై యూపీఐ ద్వారా చేసే రూ. 2,000 దాటిన చెల్లింపులపై ఛార్జీ పడనుంది. ఈ ఛార్జీ 0.4% ఉంటుంది. అలాగే గరిష్టంగా రూ. 300 వరకు ఉంటుంది. దీనికి మించి ఎలాంటి ఛార్జీ ఉండదు. అయితే రూ. 2,000 కంటే తక్కువ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీ ఉండదు. ఇది అక్టోబర్ 15 నుండి అమల్లోకి వస్తుంది. ఈ విషయమై ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ఒక నోటిఫికేషన్ జారీ చేయగా, ఈరోజు అంటే మంగళవారం, ఎన్‌పీసీఐ (NPCI) అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జారీ చేసింది.

ప్రతి రకమైన చెల్లింపుపై ఎంత ఛార్జీ విధించబడుతుందో ఇది వివరిస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, UPI ద్వారా రైలు టిక్కెట్ల చెల్లింపులు చేస్తే ఎంత ఛార్జీ పడుతుంది? మీరు రైలు ప్రయాణికులైతే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉండవచ్చు. UPIని ఉపయోగించి రైలు టిక్కెట్లకు చెల్లిస్తే ఎంత అదనపు ఛార్జీ విధిస్తారో, దానిని ఎవరు చెల్లిస్తారో తెలుసుకుందాం.

UPI ద్వారా రైలు టిక్కెట్ల కోసం చెల్లించడానికి అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందా?

ప్రశ్న ఏమిటంటే UPIతో చెల్లించడం వల్ల మీ టిక్కెట్ ధర పెరుగుతుందా? రూ.2,000 దాటిన రైల్వే లావాదేవీలపై రూ.5 MDR విధించబడినప్పటికీ, ఈ ఛార్జీని వ్యాపారి భరిస్తారు. అలాగే దీనిని ప్రయాణికుడికి బదిలీ చేయలేరు. అంటే UPI ఉపయోగించి టిక్కెట్లు బుక్ చేసుకున్నందుకు ప్రయాణికులకు ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. ఈ ఛార్జీని ఇండియన్ రైల్వేస్ భరిస్తుంది. అంటే సేవను అందించే సంస్థే MDRను భరిస్తుంది.

వినియోగదారులు నిర్దేశించిన ధరను మాత్రమే చెల్లించేలా ఈ ఫ్రేమ్‌వర్క్ నిర్ధారిస్తుందని అని NPCI తన FAQలో పేర్కొంది. సెప్టెంబర్ 15న విడుదల చేసిన తన FAQలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రైల్వేలు, టెలికాం సేవలు, బీమా, ఇంధనంతో సహా ఎంపిక చేసిన వ్యాపార వర్గాలలో రూ.2,000 దాటిన UPI లావాదేవీలపై రూ.5 ఫ్లాట్ ఎండీఆర్‌ వర్తిస్తుందని పేర్కొంది. అనేక ఇతర P2M లావాదేవీలకు వర్తించే 0.4 శాతం ప్రామాణిక MDR వలె కాకుండా, ఈ రంగాలలో ఒక స్థిరమైన ఛార్జీ ఉంటుంది.

UPI ద్వారా రైలు టిక్కెట్టు చెల్లింపు ఛార్జీలను ఎవరు చెల్లిస్తారు?

మీరు మీ రైలు టిక్కెట్టు కోసం యూపీఐ ద్వారా చెల్లిస్తే మీరు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఛార్జీని భారతీయ రైల్వే భరిస్తుంది. మీరు IRCTC ద్వారా చెల్లిస్తే, దానిని ఐఆర్‌సీటీసీ భరిస్తుంది.

మీ రైలు టిక్కెట్టు ఖరీదు రూ.3,000 అనుకుందాం. మీరు చెల్లింపు కోసం యూపీఐని ఎంచుకున్నారు. కొత్త నిబంధనల ప్రకారం, రైల్వే మర్చంట్ రూ.5ను ఎండీఆర్‌గా చెల్లిస్తారు. మీరు రూ.3,005 కాకుండా, రూ.3,000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఆ అదనపు రూ.5ను రైల్వే భరిస్తుంది.

రైలు టిక్కెట్టు ధర రూ.2000 కంటే తక్కువ ఉంటే, ఎలాంటి రుసుము ఉండదా?

మీ రైలు టిక్కెట్టు ధర రూ.2,000 కంటే తక్కువగా ఉంటే UPI లావాదేవీలపై MDR ఛార్జీలు ఉండవు. కొత్త నిబంధనల ప్రకారం.. రూ.2,000 కంటే ఎక్కువ విలువ గల సాధారణ వ్యక్తి-వ్యాపారి (P2M) లావాదేవీలపై 0.4% MDR వర్తిస్తుంది. అయితే రైల్వేల వంటి కొన్ని రంగాలకు రాయితీతో కూడిన స్థిర రుసుమును నిర్ణయించారు.

ఇది కూడా చదవండి: Indian Railways: రైల్వేలో భారీ మార్పులు.. దేశంలో 5 గతి శక్తి కార్గో టెర్మినల్స్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *