Headlines

Prithvi Raj: పృథ్వీరాజ్ స్పీడ్, టైమ్ మేనేజ్మెంట్ చూసి ఇండస్ట్రీ వర్గాల షాక్


రాజమౌళి సినిమా అంటే హీరోలు ఏళ్ల తరబడి కాల్షీట్లు లాక్ చేయాల్సిందే. జక్కన్న చెక్కినంత కాలం మరో ప్రాజెక్ట్ వైపు చూసే ఛాన్సే ఉండదు. కానీ ఓ మలయాళ స్టార్ హీరో మాత్రం ఈ రూల్‌ను బ్రేక్ చేశారు. రాజమౌళి సినిమా చేస్తూనే మరో 9 ప్రాజెక్టులను కంప్లీట్ చేసి అందరి మైండ్ బ్లాక్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా హీరో అనుకుంటున్నారా అయితే వాచ్ దిస్ స్టోరీ. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. మైథలాజికల్, సైన్స్ ఫిక్షన్, అడ్వెంచరస్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా మీద వరల్డ్ వైడ్‌గా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా, ‘కుంభ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో మలయాళ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. సాధారణంగా రాజమౌళి కాంపౌండ్‌లో అడుగుపెడితే ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియా స్టార్లు కూడా తమ డైరీని పూర్తిగా ఆయనకే అంకితం చేశారు. కానీ మలయాళ స్టార్స్ వర్కింగ్ స్టైల్, వాళ్ల స్పీడ్ ఎంత పక్కాగా ఉంటుందో పృథ్విరాజ్ మరోసారి ప్రూవ్ చేశారు. ‘వారణాసి’ ప్రీ-ప్రొడక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి తన క్యారెక్టర్ షూటింగ్ పూర్తయ్యే గ్యాప్‌లోనే.. పృథ్విరాజ్ అటు హీరోగా, ఇటు డైరెక్టర్‌గా ఏకంగా తొమ్మిది సినిమాలను కంప్లీట్ చేశారు. ఒకవైపు జక్కన్న అడిగినన్ని డేట్స్ ఇస్తూ, ఆయన విజన్‌కు తగ్గట్టుగా సెట్స్‌లో ‘కుంభ’ క్యారెక్టర్‌కు న్యాయం చేస్తూనే.. మరోవైపు తన ఇతర ప్రాజెక్ట్స్‌ను పక్కా ప్రొడక్షన్ ప్లానింగ్‌తో ఫినిష్ చేయడం పృథ్విరాజ్ కమిట్‌మెంట్‌కు పర్ఫెక్ట్ ఎగ్జామ్‌పుల్ అంటున్నారు క్రిటిక్స్‌. వారణాసి లాంటి హ్యూజ్ స్కేల్ మూవీలో నటిస్తూనే ఈ రేంజ్ స్పీడ్ మెయింటైన్ చేయడం మలయాళ హీరోలకే సాధ్యమైందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాలీవుడ్‌లో మైథలాజికల్‌ జాతర.. దేవుళ్ల కథల్లో స్టార్‌ హీరోలు!

గ్లామర్‌ నుంచి బయోపిక్స్‌కు.. స్టార్‌ హీరోయిన్ల కొత్త రూట్‌!

Gold Price Today: బంగారం నేల చూపులు…ఈరోజు తులం గోల్డ్‌ ధర ఎంతంటే!

పండుగ పూట నిండుగా వానలు.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన ఖరీఫ్ టెన్షన్ తొలగిపోయినట్లేనా?

USలో భారత విద్యార్థులకు ఉపశమనం.. ట్రంప్‌ నిర్ణయానికి కోర్టు బ్రేక్‌



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *