Headlines

DMartలో షాపింగ్ చేసేవారికి అదిరిపోయే టిప్స్‌.. ఈ 7 టిప్స్‌ తెలిస్తే చాలు మరింత సేవింగ్‌!


డిమార్ట్ (DMart) దీని గురించి తెలియనివారంటూ ఉండరు. అతి తక్కువ ధరల్లో ఎక్కడ లభిస్తాయంటే టక్కున వచ్చే పదం డీమార్ట్‌. నిత్యవసరాలతో పాటు మరెన్నో వస్తువులు ఇందులో లభిస్తాయి. ఎప్పుడు కూడా భారీ డిస్కౌంట్లతో కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. డిమార్ట్‌లో ఇంటికి అవసరమైన వస్తువులు తక్కువ ధరలో లభిస్తాయి.

వంటగదికి కావాల్సిన వస్తువులు అయినా, ఇంట్లో ఫర్నీచర్, ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువులు అయినా ఇక్కడ ఈజీగా దొరుకుతాయి. అందుకే డిమార్ట్ షాపింగ్ అంటే జనాలు ఎగబడి మరీ కొంటారు. డీమార్ట్‌లో ఏడాది పాటు ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. అయితే కొన్ని స్మార్ట్ షాపింగ్ టిప్స్ పాటించి మీరు మరింత ఎక్కువ డబ్బులను ఆదా చేసుకోవచ్చు. ఈ టిప్స్‌పాటిస్తే మీ డబ్బును భారీగా ఆదా చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Flipkart, Amazon: ఫెస్టివల్ సేల్స్‌లో 80% డిస్కౌంట్ ఇచ్చినా.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు కోట్లలో లాభాలు ఎలా వస్తాయి?

  1. ఆఫర్లు డిస్కౌంట్లపై దృష్టి పెట్టండి: డిమార్ట్‌లో ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఆఫర్లు పెడుతుంటారు. ముఖ్యంగా ‘ఒకటి కొంటే ఒకటి ఉచితం’ (buy one get one free) అనే ఆఫర్ ఎప్పుడూ ఉంటాయి. రెండు ఏం చేసుకుంటాంలే అనుకునేవారికి.. ఆ వస్తువును సగం రేటుకే కొనుకోవచ్చు. పండుగల సందర్భంగా డిమార్ట్ భారీ డిస్కౌంట్లు ఇస్తుంది. ఈ టైమ్‌లో జనాలు ఎగబడి మరీ కొంటారు. డిమార్ట్ ఇచ్చే డిస్కౌంట్లు అధిక షాపింగ్‌పై ఇచ్చే ఆఫర్ల కోసం వెబ్‌సైట్ లేదా ఫ్లయర్స్ చూడండి.
  2. టోకు షాపింగ్ చేయండి: బియ్యం, పప్పులు, నూనె, సబ్బులు లాంటి త్వరగా పాడవని వస్తువులు బల్క్‌గా కొనండి. దీని వల్ల ఎక్కువ డబ్బు ఆదా అవుతుంది. ఉదాహరణకు 5 కిలోల బస్తా బదులు 25 కిలోల బియ్యం బస్తా తీసుకోవడం మంచిది. ఇలా తీసుకుంటే మీకు తక్కువ ధరల్లో లభిస్తాయి. కానీ అవసరం లేని వస్తువులు కొని ఎక్స్‌పైరీ డేట్ అయిపోతే మీరు నష్టపోతారని గుర్తించుకోండి.
  3. షాపింగ్ లిస్ట్ తయారు చేసుకోండి: ఇక మీరు షాపింగ్‌కు వెళ్లినప్పుడు ముందుగా మీరు కొనే వస్తువులన లిస్ట్‌ను తీయరు చేసుకోవడం తప్పనిసరి అని గుర్తించుకోండి. దీని వల్ల అనవసరమైన వస్తువులు కొనే అవకాశం ఉంది. కాబట్టి ఇంటి నుండి బయలుదేరే ముందు ఒక షాపింగ్ లిస్ట్ (shopping list) తయారు చేసుకుని దానిలో ఉన్నవి మాత్రమే కొనండి. దీని వల్ల అనవసరమైన డబ్బు ఖర్చు కాకుండా మీ బడ్జెట్ అదుపులో ఉంటుంది.
  4. తక్కువ రద్దీ ఉన్న రోజుల్లో వెళ్ళండి: మీరు డీమార్ట్‌కు వెళ్లే ముందు తక్కువ రద్దు ఉండే రోజుల గమనించి వెళ్లడం మంచిది. వారాంతాల్లో నెల మొదట్లో డిమార్ట్‌లో చాలా రద్దీ ఉంటుంది. ఆఫర్లు సరిగా చూడలేరు. తొందరలో తప్పుగా షాపింగ్ చేసే అవకాశం ఉంది. వీలైనంత వరకు సోమవారం లేదా మంగళవారం లాంటి రోజుల్లో షాపింగ్ చేయండి. దీని వల్ల మీరు ప్రతీ సెక్షన్‌ను బాగా చూసి మంచి ఆఫర్లు ఎంచుకోవచ్చు.
  5. డిమార్ట్ బ్రాండ్ ఉత్పత్తులు వాడండి: డిమార్ట్ సొంత బ్రాండ్ ప్రోడక్ట్‌లు పెద్ద బ్రాండ్లతో పోలిస్తే తక్కువ ధరలో లభిస్తాయి. వాటి నాణ్యత కూడా బాగుంటుంది. సబ్బులు, డిటర్జెంట్లు, స్నాక్స్, డ్రై ఫ్రూట్స్ లాంటివి డిమార్ట్ బ్రాండ్‌లో కొని మీరు డబ్బులు ఆదా చేసుకోవచ్చు.
  6. ఆఫర్ సెక్షన్ ఎక్కడ ఉందో చూడండి: డిమార్ట్‌లో కొన్ని ప్రత్యేక విభాగాల్లో గడువు దగ్గర ఉన్న లేదా డిస్కౌంట్లు ఉన్న వస్తువులు ఉంటాయి. ఈ సెక్షన్లో “ఒకటి కొంటే ఒకటి ఉచితం” (buy one get one free) లాంటి డీల్స్ ఉంటాయి. మీరు ఆ వస్తువులను త్వరగా వాడేటట్లు అయితే వెంటనే కొనడం మంచిది. కానీ వస్తువులు కొనేటప్పుడు ఎల్లప్పుడూ వాటి గడువు తేదీని కూడా తనిఖీ చేయండి.
  7. మొత్తం స్టోర్ పరిశీలించండి: చాలా మంది కొన్ని సెక్షన్లలో మాత్రమే షాపింగ్ చేస్తారు. కానీ డిమార్ట్‌లో ప్రతీ విభాగంలో వివిధ ఆఫర్లు ఉంటాయి. అందుకే అన్ని సెక్షన్లు చూడండి. అక్కడ మీకు ఏదైనా ఆఫర్ దొరకవచ్చు.

ఇది కూడా చదవండి: WhatsApp: ఆ సమస్యకు చెక్‌.. వాట్సాప్‌లో ఈ ట్రిక్‌ గురించి తెలిస్తే షాకవుతారు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *