Headlines

EPFO: మీ కంపెనీ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు వేయడం లేదా..? ఇలా ఫిర్యాదు చేస్తే మీ ప్రాబ్లం క్లియర్..


పీఎఫ్ అకౌంట్లో ప్రతీ నెలా మీ యజమాని వాటాతో పాటు మీ వాటా కూడా జమ అవుతూ ఉంటుంది. అయితే చాలామంది ప్రతీ నెలా ఇవి జమ అవుతున్నాయా.. లేదా అనేది చెక్ చేసుకోరు. యూఏఎన్ యాక్టివేట్ చేసి అలాగే వదిలేస్తుంటారు. అయితే మీ అకౌంట్లో ప్రతీ నెలా డబ్బులు జమ అవుతున్నాయా.. లేదా అనేది తెలుసుకోవడం ముఖ్యం. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అదే మీరు ప్రతీ నెలా చెక్ చేసుకోకపోతే మీకు ఏదైనా సమస్య ఉన్నా తెలియదు. దీంతో ఆలస్యంగా తెలుసుకుంటే కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. మీ అకౌంట్లో ప్రతీ నెలా కాంట్రిబ్యూషన్ జమ అవుతుందా.. లేదా అనేది సులువుగా తెలుసుకోవచ్చు. అదెలా అనేది ఒకసారి చూద్దాం.

జీతం నుంచి పీఎఫ్ కట్ అవుతున్నంత మాత్రాన, శాలరీ స్లిప్‌లో పొందుపర్చి ఉన్నంత మాత్రాన పీఎఫ్ సొమ్ము జమ అవుతుందని అనుకుంటే పొరపాటు పడినట్లే. కంపెనీలు ప్రతీ నెలా 15వ తేదీలోపు వీటిని జమ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు పీఎఫ్ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ఒక్కొసారి కంపెనీలు జమ చేయకుండా ఉండవచ్చు. జమ చేయకపోతే మీరు ఫిర్యాదు చేయవచ్చు. ఇది తెలియాలంటే మీరు ప్రతీ నెలా తనిఖీ చేసుకుంటూ ఉండాలి. నాలుగు విధానాల్లో మీరు సులువుగా తెలుసుకోవచ్చు.

ఎలా తెలుసుకోవాలంటే..?

ఈపీఎఎఫ్ పాస్ బుక్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ముందుగా పీఎఫ్ పాస్ బుక్ వెబ్ సైట్లోకి వెళ్లి మీ యూఏఎన్ పాస్ వర్డ్, క్యాప్చాతో లాగిన్ అవ్వాలి. అనంతరం పాస్ బుక్ ఆప్షన్ ఎంచుకోవాలి. మీ కంపెనీని ఎంచుకోవాలి. దీంతో మీ పీఎఫ్ పాస్ బుక్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఉద్యోగి, యజమాని వాటా రెండు కనిపిస్తాయి. మీ శాలరీ స్లిప్‌లో ఎంత అయితే కట్ అయిందో అంత సొమ్ము జమ అయిందా.. లేద అనేది పరిశీలించుకోండి. ఉక ఉమాంగ్ యాప్, ఎస్‌ఎంఎస్, ఫోన్ కాల్ ద్వారా కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఒకవేళ డబ్బులు జమ కాకపోతే హెచ్ఆర్ లేదా పేరోల్ విభాగాన్ని తొలుత సంప్రదించాలి. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే EPFiGMS ద్వారా ఫిర్యాదు చేయాలి. దీంతో పీఎఫ్ అధికారులు స్పందించి మీ సమస్యను పరిష్కరిస్తారు. ఒకవేళ ఆలస్యంగా పీఎఫ్ సొమ్ము జమ అయినా మీ వడ్డీకి ఎలాంటి నష్టం జరగదు. యజమాని ఆలస్యంగా జమ చేస్తే ఆ కాలానికి రావాల్సిన వడ్డీని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పెనాల్టీ కూడా యజమానిపై పడొచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *