Headlines

Mirzapur: నిన్న బాహుబలి.. నేడు మీర్జాపూర్.. బొమ్మ బ్లాక్‌బస్టర్


లాస్ట్ ఇయర్ బాహుబలి విషయంలో జరిగిన మ్యాజిక్కే తాజాగా మీర్జాపూర్ విషయంలోనూ జరుగుతుందా..? ఎక్కడి బాహుబలి.. ఎక్కడి మీర్జాపూర్.. ఈ రెండింటికి అస్సలు సంబంధం ఏదైనా ఉందా అనుకుంటున్నారు కదా..? ఇది సినిమా ఇండస్ట్రీ.. ఇక్కడ ఎక్కడ్నుంచి ఎక్కడికైనా లింక్ ఉంటుంది. అలాంటి లింకే మీర్జాపూర్, బాహుబలి మధ్య ఉంది. అదేంటో చూద్దామా..?ట్రెండ్ అనేది ఎప్పుడూ ఎవరో ఒకరు సెట్ చేస్తూ ఉండాలి.. అది ఆనవాయితీ అంతే. తాజాగా ఈ ట్రెండ్ సెట్ చేసే వంతు మీర్జాపూర్‌కు వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సంచలనాలు చూస్తుంటే కొత్త కొత్త ఆలోచనలకి ప్రాణం పోస్తున్నట్లుంది. లాస్ట్ ఇయర్ బాహుబలితో రాజమౌళి చేసిన మ్యాజిక్కే.. ఇప్పుడు మీర్జాపూర్‌ విషయంలోనూ జరుగుతుంది. 2025లో బాహుబలి 1 అండ్ 2 కలిపి ఎపిక్ అని రీ రిలీజ్ చేసి 50 కోట్లు వసూలు చేసారు జక్కన్న. తాజాగా వెబ్ సిరీస్‌లలో చరిత్ర సృష్టించిన మీర్జాపూర్ 3 సీజన్స్ కలిపి సినిమాగా తీసుకొచ్చారు. 14 గంటలకు పైగా ఉన్న రన్ టైమ్‌ను 3 గంటల సినిమాగా ఎడిట్ చేసేసరికి ఎగబడి చూస్తున్నారు ఆడియన్స్. 3 రోజుల్లోనే 100 కోట్లకు పైగా వసూలు చేసింది మీర్జాపూర్: ది మూవీ. మీర్జాపూర్ జోరు చూస్తుంటే 200 కోట్లు కేక్ వాక్ అనిపిస్తుంది. ఈ సక్సెస్ ఓ కొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఇండియాలో మీర్జాపూర్ రేంజ్‌లో అలరించిన వెబ్ సిరీస్‌లు చాలానే ఉన్నాయి. ఫ్యామిలీ మ్యాన్, పాతాల్ లోక్ ఇలా చెప్తూ పోతే ఎన్నో..! వీటిని కూడా రేపొద్దున సినిమాలుగా చేసే అవకాశం లేకపోలేదు. మొత్తానికి ఖాలీన్ భయ్యా అండ్ గ్యాంగ్ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తున్నారిప్పుడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!

దుబాయ్‌లో సింగిల్‌ రూమ్‌ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!

అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!

పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు

హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఇక.. మెట్రో, ఆర్టీసీ ప్రయాణం మరింత సులభం!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *