Headlines

దుబాయ్‌లో సింగిల్‌ రూమ్‌ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!


దుబాయ్ అంటేనే విలాసవంతమైన భవనాలు, ఖరీదైన కార్లు, భారీ జీతాలు గుర్తొస్తాయి. కానీ అక్కడ జీవితం అందరికీ అంత అందంగా ఉండదు. ముఖ్యంగా తక్కువ, మధ్యతరగతి ప్రవాసులు అద్దెలు భరించలేక పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ఓ భారతీయ మహిళ దుబాయ్‌లో తాను నెలకు ముప్పై వేలు చెల్లించి ఉంటున్న అతి చిన్న గదిని సోషల్ మీడియాలో చూపించగా, అది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రూ.30 వేలకు దుబాయ్‌లో మీకు ఏం దొరుకుతుంది? అంటూ ఆమె ఆ వీడియోను ప్రారంభించింది. చిన్న దారి గుండా వెళ్తే డ్యూప్లెక్స్ తరహాలో కనిపించే ఆ గదిలో, పైభాగంలో నిద్రించడానికి మంచం మాత్రమే ఉంది. కింద భాగంలో సామాన్లు సర్దుకోవడానికి కూడా సరైన స్థలం లేదు. కేవలం చిన్న ఏసీ సదుపాయం మాత్రమే అక్కడ కనిపిస్తుంది. సింగిల్‌గా ఉంటే నెలకు 1,200 నుండి 1,300 దిర్హామ్‌లు అంలే భారత కరెన్సీలో సుమారు రూ.30 వేల నుంచి రూ.33 వేలు చెల్లించాల్సి ఉంటుందని ఆమె తెలిపింది. అదే ఇద్దరైతే 1,400 నుంచి 1,500 దిర్హామ్‌లు అంటే దాదాపు రూ.36 వేల నుంచి రూ.39 వేలు అవుతుందని పేర్కొంది. దుబాయ్‌లో ఉపాధి కోసం వెళ్లే కొత్తవారంతా మొదట్లో ఇలాంటి బెడ్‌స్పేస్‌లు, పార్టిషన్ రూమ్‌లలోనే కాలం వెళ్లదీయాల్సి వస్తుందని ఈ వీడియో మరోసారి నిరూపించింది. విలాసాల నగరంలో బతకాలంటే అద్దె రూపంలో భారీగా ఖర్చు చేయాల్సిందేనని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!

పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు

హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఇక.. మెట్రో, ఆర్టీసీ ప్రయాణం మరింత సులభం!

లోను తీసుకున్న వ్యక్తి కట్టలేకపోతే.. అది ఎవరు చెల్లించాలి.. బ్యాంకు రూల్స్‌ ఇవే!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *