జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం సహజం. అయితే అతి త్వరలో బుధ గ్రహం, శుక్రగ్రహం రెండూ కూడా శుభ గ్రహాలు. అయితే ఇవి రెండూ కూడా ఒకే రాశిలో కలవడం వలన సెప్టెంబర్ 26 నుంచి మూడు రాశుల వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుందంట. ఆర్థికంగా చాలా బాగుంటుంది అని చెబుతున్నారు నిపుణులు.
తుల రాశి : తుల రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం వలన ప్రతి పనిలో విజయం వరిస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పని కూడా చాలా త్వరగా పూర్తి చేసుకుంటారు. అన్ని విధాలుగా వీరికి ఇది చాలా మంచి సమయం.
వృషభ రాశి : వృషభ రాశి వారికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నారో వారికి ఇది చాలా అద్భుతమైన సమయం. అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు. చాలా రోజుల నుంచి తీరని కోరికలు కూడా వీరికి ఈ సమయంలో తీరుతాయి.
మేష రాశి : మేష రాశి వారికి కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆర్థికంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. సమాజంలో వీరికి అంటూ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుంది.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




