Headlines

Actress Urvashi: ఆ హీరోయిన్‌ నాకు అక్కలాంటిది.. ఆమె అకాల మరణం చాలా బాధేసింది.. నటి ఊర్వశి ఎమోషనల్


మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెదిన ప్రముఖ నటి ఊర్వశికి తెలుగు, తమిళ భాషల్లోనూ మంచి గుర్తింపు ఉంది. ఒకప్పుడు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాల్లోనూ హీరోయిన్ గా నటించిందీ అందాల తార. అలాగే తమిళం, మలయాళ భాషల్లో వందలాది సినిమాలు చేసింది. వివిధ కారణాలతో మధ్యలో విరామం తీసుకున్నా ఇప్పుడు మళ్లీ సహాయక నటిగా రాణిస్తున్నారు ఊర్వశి. తాజాగా ఆమె నటిస్తోన్న చిత్రం ‘ఆశా’. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇక ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇదే క్రమంలో అకాల మరణం చెందిన సిల్క్ స్మితతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారీ సీనియర్ నటి.

‘సిల్క్ స్మిత నాకు చాలా సహాయం చేశారు. నేను ఆమెను ఒక అక్కలా చూసేదాన్ని. ఆ రోజుల్లో, చిత్ర పరిశ్రమలో గ్లామరస్ పాత్రలు పోషించే నటీమణులను చాలా డిఫరెంట్ గా చూసేవారు. అందుకే సిల్క్ స్మిత ఇతరులకు దూరంగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడేవారు. ఆమె ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. మరోవైపు చాలా మంది ఆమెను వింత దృష్టితో చూసేవారు. దుస్తుల విషయంలో కూడా అలాగే ఉండేది. స్మితకు ఉన్నంత వస్త్రధారణ అభిరుచి ఉన్నవారిని నేను ఎప్పుడూ చూడలేదు. రంగుల ఎంపిక, అలంకరణ అభిరుచి, ప్రతీ విషయంలోనూ ఆమె చాలా డిఫరెంట్ గా ఆలోచించేది. అప్పట్లో అతిగా మేకప్ వేసుకునేవాళ్లు మరీ ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ చేసే వాళ్లు కళ్ల పైభాగంలో మేకప్ వేసుకునేవారు. వాళ్లు తమకు నచ్చినట్లుగా చేసుకోగలిగేవారు. కానీ స్మిత ఏ దుస్తులలోనూ అసభ్యంగా కనిపించేది కాదు. ఆమె ఎలాంటి దుస్తులనైనా ధరించగలదు. ఎప్పటికైనా నా కాస్ట్యూమ్ డిజైన్ చేయాలనే గొప్ప కోరిక స్మితకు ఉండేది. ఆమె, ‘నేను ఒక సినిమా కోసం కాస్ట్యూమ్ తయారు చేసి నీకు ఇస్తాను, ఎంత సరదాగా ఉంటుందో కదా ఊర్వశి’ అని అనేది. ఆమె ఏది ఇస్తే అది నేను తీసుకునేదాన్ని. చివరి వరకు అది నా గొప్ప కోరికగానే మిగిలిపోయింది. కానీ, ఆ సమయంలో నాకు ఒక కాస్ట్యూమ్ డిజైనర్ ఉండేవారు, పైగా అప్పట్లో డిజైనింగ్ ప్రోగ్రామ్ కూడా లేదు. అది బొంబాయిలో మాత్రమే చాలా అరుదుగా ఉండేది,’ అని ఊర్వశి సిల్క్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది.

ఇవి కూడా చదవండి



Actress Urvashi, Silk Smith

Actress Urvashi, Silk Smitha

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *