Headlines

Snake in Bike: బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు


ఇటీవల కాలంలో పాములు జనావాసాల్లోకి చొరబడుతూ ఎక్కడపడితే అక్కడ తిష్టవేస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా కరీంనగర్‌లో జరిగిన ఒక ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఎప్పుడూ రద్దీగా ఉండే అంబేద్కర్ స్టేడియం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా పాము కదలికలను గుర్తించాడు. అనుమానం వచ్చి బైకును పక్కకు ఆపి ఏమై ఉంటుందా అని పరిశీలించాడు. అంతే బైక్‌ సీటుకింద నక్కి ఉన్న పాము కనిపించింది. ఆ నాగుపాము నేరుగా హెడ్‌లైట్ గుండా సీటు కిందకి వెళ్లి దాక్కుంది. ఆ వ్యక్తి కంగారు చూసి అక్కడ క్షణాల వ్యవధిలో చుట్టూ జనం గుమిగూడారు. పరిస్థితిని అర్థం చేసుకున్న కొందరు వెంటనే స్థానిక బైక్ మెకానిక్‌ను పిలిపించారు. మెకానిక్ ఎంతో జాగ్రత్తగా బైక్ సీటును తొలగించాడు…అంతే ఒక్కసారిగా నాగుపాము పిల్ల ఒక్కసారిగా బటకు దూకింది. జనాల హడావిడికి బెదిరిపోయిన ఆ నాగుపాము భయంతో పక్కనే ఉన్న నాలాలోకి వెళ్లిపోయింది. దాంతో అక్కడున్నవారందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. నిజానికి నాగుపాములు కొద్దిపాటి శబ్దానికే దూరంగా వెళ్తాయి. కానీ, ఇలా నేరుగా రద్దీ బైక్‌లలోకి చొరబడుతుండటం ప్రజలను కలవరపెడుతోంది. పట్టణ ప్రాంతాల్లో పెరిగిపోతున్న కాలుష్యం, చెట్లను నరకడం వల్ల ఆవాసాలు కోల్పోయిన సరీసృపాలు ఇలా జనావాసాల్లోకి వస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు పార్క్ చేసేటప్పుడు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పరిశీలించాలని మెకానిక్‌లు సూచిస్తున్నారు. ఏది ఏమైనా, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్‌ చేసిన పోలీసుల కళ్లు జిగేల్‌!

మెట్రోరైల్లో యాడ్‌ చూసి మహిళలు ఫైర్.. ఇంతకీ ఆ యాడ్‌లో ఏముందో తెలుసా!

300 ఏళ్ల తర్వాత రామప్ప ఆలయంలో అరుదైన ఘట్టం..

పోలేరమ్మ గుడిలో అద్భుతం.. అమ్మవారి విగ్రహంపై మరో రెండు కళ్లు ప్రత్యక్షం

పేకమేడల్లా కూలుతున్న భవనాలు.. హస్తినలో డేంజర్‌ బెల్స్‌



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *