నందమూరి వారసుడి ఎంట్రీ ఎప్పుడు.. ఎప్పటిఎప్పుడు ఇప్పుడు అప్పుడూ అంటున్నా మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ రాలేదు. ఇన్నాళ్లకు దానిపై కన్ఫర్మేషన్ వచ్చింది. మనం ఎప్పుడో చెప్పినట్లుగానే వశిష్టతోనే మోక్షు ఫస్ట్ మూవీ ఓకే అయిపోయింది. మరి ఆ సినిమా ఎలా ఉండబోతుంది..? మోక్షజ్ఞ మొదటి సినిమాలో ఎలాంటి విశేషాలు ఉండబోతున్నాయి..? బాలయ్య కూడా నటిస్తున్నారా..? తన సినిమాలు చేసుకుంటూనే.. తనయుడి సినిమా గురించి కూడా ఆలోచిస్తున్నారు బాలయ్య. గత రెండేళ్లుగా వారసుడిని పరిచయం చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నా.. ఎందుకో ముహూర్తాలే సెట్ అవ్వట్లేదు. అన్నీ ఓకే అయినట్లే అవుతున్నా.. చివరి నిమిషంలో వాయిదా పడుతున్నాయి. ఆ మధ్య ప్రశాంత్ వర్మతో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినా.. లాస్ట్ మినిట్‌లో డ్రాప్ అయింది. మోక్షజ్ఞ మొదటి సినిమా కోసం ముందు నుంచి మనం చెప్పినట్లుగానే వశిష్ట వచ్చారిపుడు. విశ్వంభర సినిమా విడుదలకు రెడీ అవుతున్న వేళ.. నందమూరి వారసున్ని పరిచయం చేసే బాధ్యత ఈ దర్శకుడు తీసుకున్నారు. నవంబర్ చివరి వారంలో ఓపెనింగ్ జరగనుంది.. అప్పట్నుంచే రెగ్యులర్ షూట్ కూడా షురూ కానుంది. సోషియో ఫాంటసీగా ఈ సినిమా రాబోతుంది. బాలయ్య దగ్గరుండి మరీ మోక్షజ్ఞ కథ సిద్ధం చేయించడమే కాకుండా.. ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే నందమూరి కంపౌండ్‌లో కళ్యాణ్ రామ్‌కు బింబిసార లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చారు వశిష్ట. ఇప్పుడు మోక్షుతో సినిమా చేయబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి చూడాలిక.. మోక్షు ఎలాంటి సంచలనం సృష్టించబోతున్నారో..?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP9 ET: డ్రాగన్ కోసం రంగలోకి దిగిన లూగర్..| రాకా కోసం.. ఈ సారి రెమ్యునరేషన్ కాదు.. అంతకు మించి..
TOP 9 ET News: అప్పుడే 320 కోట్ల బిజినెస్ ఇదెక్కడి అరాచకం సామి.. | NTR క్రేజ్‌కు ఇదొక ఋజువనే చెప్పాలి
New Row On Irumudi: లిక్కర్ తాగేవాళ్లే మాల వేస్తారా ?? ఇరుముడి సినిమాపై కొత్త వివాదం
హృదయవిదారక ఘటన.. చనిపోయిన అమ్మానాన్నలు మళ్లీ వస్తారని ఆ చిన్నారి ఎదురుచూపు
వినాయక చవితి వస్తున్నా వాన లేదు. మబ్బులే తప్ప చినుకు కరువు.. వర్షాలు లేక రైతుల్లో ఆందోళన