Headlines

విజయ్ అభిమానులకు క్రేజీ న్యూస్.. రణబాలి టీజర్ రిలీజ్


టాలీవుడ్ స్టార్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న మూవీ రణబాలి. ఈ మూవీ టీజర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చింది. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ తాజాగా చిత్ర బృదం రిలీజ్ చేసింది. 19వ శతాబ్దం 1854-1878 మధ్య బ్రిటిష్ పాలన కాలం నాటి చారిత్రక నేపథ్యంలో రాయల సీమ ప్రాంత అధిపత్య పోరాటాలు, వాస్తవ ఘటనల ఆధారంగా ఈ మూవీ తెరక్కెతున్న విషయం తెలిసిందే. కాగా, రీసెంట్‌గా రిలీజ్ చేయగా సినిమా టీజర్ అదిరిపోయింది.

ఇందులో విజయ్ దేవరకొండ శింగ‌న‌మ‌ల బొబ్బిలి ర‌ణ‌బాలి పాత్రలో కనిపించి, తన నటనతో అందగొట్టాడు. యాక్షన్ సీన్స్, తన డైలాగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాకు మ్యూజిక్ ప్రాణం పోసిందంని చెప్పాలి. సినిమాలో సంగీతం చాలా అద్భుతంగా ఉంది. అలాగే స్టార్ బ్యూటీ రష్మిక విజయ్ దేవరకొండ భార్య, జయమ్మ పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది. మొత్తానికి టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ఇక ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 16న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

రణబాలి టీజర్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *