Headlines

ఇంటర్ పాసైతే.. రూ.92,000 జీతం! SSC నుంచి బిగ్ నోటిఫికేషన్!!


ఇంటర్మీడియట్ చదువుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వారి కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అదిరిపోయే గుడ్ న్యూస్ ప్రకటించింది. SSC-CHSL-2026 నోటిఫికేషన్ అధికారికంగా రిలీజ్ చేసింది. ఏకంగా 2,536 ఖాళీలతో వచ్చిన ఈ ఉద్యోగాల పూర్తి వివరాలు, అర్హతలు, సిలబస్, ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం. ఎస్సెస్సీ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ‘A’పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య సుమారుగా 2,536 వరకు ఉంది. ఈ ఉద్యోగాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో భర్తీ చేస్తున్నారు. ఇక వేతనాల విషయానికి వస్తే.. ఎల్​డీసీ, జేఎస్​ఏ పోస్టులకు పే-స్కేల్ రూ.19,900 నుంచి రూ.63,200 వరకు ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు, అలాగే డీఈఓ గ్రేడ్ ‘ఏ’ పోస్టుకు అత్యధికంగా రూ.29,200 నుంచి రూ.92,300 వరకు బేసిక్ పే లభిస్తుంది. సెంట్రల్ జాబ్ అంటేనే అందరికీ తెలిసిందేగా.. పీఆర్సీ అలవెన్సులు, హెచ్‌ఆర్‌ఏ అన్నీ కలిపి మొదటి నెల నుంచే చేతికి మంచి జీతం అందుతుంది. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను పరిశీలించినట్లయితే సెప్టెంబర్‌ 7 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. రఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 7 రాత్రి 11:00 గంటల వరకు నిర్ణయించారు. అక్టోబర్‌ 8 లోగా ఆన్‌లైన్ ఫీజు చెల్లింపునకు అవకాశం ఇచ్చారు. ఏవైనా తప్పులుంటే సవరించుకోవడానికి అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 16, 2026 వరకు అప్లికేషన్ కరెక్షన్ విండో తెరిచి ఉంటుంది. ఇక కంప్యూటర్ ఆధారిత పరీక్ష టైర్-1 తేదీలను కమిషన్ త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ విద్యార్హతల విషయానికొస్తే.. ఎల్​డీసీ, జేఎస్​ఏ, సాధారణ డీఈఓ పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన కోర్సు పాస్ అయి ఉండాలి. ప్రస్తుతం ఇంటర్మీడియట్ చివరి సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. అయితే, అక్టోబర్ 7, 2026 నాటికి మీ చేతిలో పాసింగ్ సర్టిఫికెట్ లేదా అర్హతా పత్రాలు ఉండాలి. ఇక వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ, ఎస్​ఎస్​సీ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలలోని కొన్ని ప్రత్యేక డీఈఓ, డీఈఓ గ్రేడ్ ‘ఏ’ పోస్టులకు మాత్రం కొద్దిగా తేడా ఉంది. గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్ గ్రూప్‌లో మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్‌గా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్థులకు అక్టోబర్ 1, 2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి, గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు దాటకూడదు. అంటే ఆగస్టు 2, 1999 నుంచి ఆగస్టు 1, 2008 మధ్య జన్మించిన వారు అర్హులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీలైన ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 15 సంవత్సరాల వరకు గరిష్ట వయస్సులో సడలింపులు వర్తిస్తాయి. SSC-CHSL ఎంపిక ప్రక్రియ ప్రధానంగా రెండు దశల కంప్యూటర్ ఆధారిత పరీక్షలపై ఆధారపడి ఉంటుంది. అవే టైర్-1 అండ్‌ టైర్-2. టైర్-1 పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దీనికి మొత్తం 200 మార్కులు కేటాయించారు. ఇందులో నాలుగు ప్రధాన సబ్జెక్టులు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు – 50 మార్కులు. జనరల్ ఇంటెలిజెన్స్ / రీజనింగ్ 25 ప్రశ్నలు – 50 మార్కులు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ / గణితం 25 ప్రశ్నలు – 50 మార్కులు. జనరల్ అవేర్‌నెస్ అంటే జికే లో 25 ప్రశ్నలు – 50 మార్కుల వారీగా క్వశ్చన్‌ పేపర్‌ ఉంటుంది. టైర్-1 లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే టైర్-2 పరీక్షకు అర్హులవుతారు. టైర్-2 లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్స్ ఉంటాయి. దీనికి మొత్తం 405 మార్కులు కేటాయించారు. ఆ తర్వాత కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ జాబ్ ఇస్తారు. ఇక్కడ చాలా మంది చేసే తప్పు ఒకటే. ఎస్​ఎస్​సీ వారు తమ అధికారిక వెబ్‌సైట్‌ను పూర్తిగా మార్చేశారు. పాత వెబ్‌సైట్ ఐడీలు ఇక్కడ పనిచేయవు. మీరు కొత్త వెబ్‌సైట్ అయిన ssc.gov.in ద్వారా లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి అధికారిక ‘MySSC’ మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని అప్లై చేసుకోవాలి. మీరు గతంలో పాత వెబ్‌సైట్‌లో వన్-టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నప్పటికీ, ఇప్పుడు కొత్త వెబ్‌సైట్‌లో మళ్లీ కొత్తగా ఓటీఆర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఒక్కసారి కొత్త వెబ్‌సైట్‌లో ఓటీఆర్ కంప్లీట్ చేస్తే భవిష్యత్తులో ఎస్​ఎస్​సీ పెట్టే ప్రతి పరీక్షకు అదే ఉపయోగపడుతుంది. OTR ప్రాసెస్ చేసేటప్పుడు తప్పకుండా ఆధార్ ఆథెంటికేషన్ ఎంచుకోండి! దీనివల్ల చాలా లాభం ఉంది. ఆధార్ ఆథెంటికేషన్ ఎంచుకుంటే, మీరు అప్లోడ్ చేసే ఫోటో లేదా సంతకం సరిగ్గా లేవనే కారణంతో మీ అప్లికేషన్ ఎప్పటికీ రిజెక్ట్ కాదు. అంతేకాకుండా, ఎగ్జామ్ హాల్‌కి వెళ్లేటప్పుడు ప్రత్యేకంగా తాజా పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫోటోలు, ఒరిజినల్ ఐడీ ప్రూఫ్‌లు పదే పదే చూపించాల్సిన అవసరం ఉండదు. ఇక దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే.. జనరల్ అండ్‌ ఓబీసీ అభ్యర్థులకు కేవలం రూ.100 మాత్రమే. అదే మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు అండ్‌ మాజీ సైనికులకు ఈ దరఖాస్తు పూర్తిగా ఉచితం! ఏ ఒక్కరూ ఫీజు గురించి ఆలోచించకుండా అందరూ అప్లై చేసుకుంటే బెటర్‌. మొత్తానికి ఇంటర్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సాధించడానికి ఇదొక గోల్డెన్ ఛాన్స్. చివరి తేదీ వరకు అస్సలు ఆగకండి, సర్వర్ బిజీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్లాస్‌ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్‌ అంతలోనే ఊహించని సంఘటన

Snake in Bike: బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు

ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్‌ చేసిన పోలీసుల కళ్లు జిగేల్‌!

మెట్రోరైల్లో యాడ్‌ చూసి మహిళలు ఫైర్.. ఇంతకీ ఆ యాడ్‌లో ఏముందో తెలుసా!

300 ఏళ్ల తర్వాత రామప్ప ఆలయంలో అరుదైన ఘట్టం..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *