బుల్లితెరపై అసలైన ఎంటర్టై్న్మెంట్ మొదలైంది. మొన్నటివరకు అగ్నిపరీక్ష.. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అయ్యింది. అయితే మొదటి రోజే హౌస్ లో గొడవలతో రచ్చ కాగా.. ఇక తొలివారం నామినేషన్లలో అసలైన ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌస్ లో ఉన్న మొత్తం 16 మంది కంటెస్టెంట్లను నామినేషన్లలో పడేశాడు. ఎప్పటిలాగే అగ్ని పరీక్ష ద్వారా తమ ఓటింగ్ స్థానాలను పదిలంగా ఉండేలా చూసుకుంటున్నారు కామనర్స్. అలాగే తమకు నచ్చిన కంటెస్టెంట్స్ అదృష్టాన్ని మార్చే బాధ్యత పూర్తిగా ప్రేక్షకుల చేతుల్లోకి వచ్చింది. మొదటి రోజు ఓటింగ్ సరళిని పరిశీలిస్తే, ప్రేక్షకులలో ఎవరికి ఎంత క్రేజ్ ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఊహించని విధంగా ఓటింగ్ రేసులో దుమ్మురేపుతున్నాడు సీరియల్ హీరో ముఖేష్ గౌడ.
తొలి రోజు ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం, మొదటి ఆరు స్థానాల్లోనూ మేల్ కంటెస్టెంట్లే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మొత్తం ఓట్లలో దాదాపు 60 శాతానికి పైగా ఓట్లను వీరే పంచుకోవడం విశేషం. ‘అగ్నిపరీక్ష’ ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న రోహిత్, ప్రస్తుతం 20 శాతం ఓటింగ్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. హౌస్‌లో త్రిగుణ్ , ఇతర సభ్యులు ఇతడిని టార్గెట్ చేయడం వల్ల రోహిత్‌కి సింపతీ వర్కవుట్ అయి ఆడియన్స్ సపోర్ట్ మరింత పెరిగింది.
ముఖేష్ గౌడ (18% ఓటింగ్): ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ఫేమ్ ముఖేష్ గౌడ (రిషి) రోహిత్‌కి గట్టి పోటీ ఇస్తున్నాడు. తనకున్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్, హౌస్‌లో ప్రశాంతమైన ప్రవర్తనతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ రెండో స్థానంలో నిలిచాడు.
రామ్ ప్రసాద్ (10% ఓటింగ్): జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక అదే క్రేజ్.. అలాగే తనకున్న టైమింగ్, ఎంటర్టైన్మెంట్తో రామ్ ప్రసాద్ మూడో స్థానంలో సేఫ్‌గా ఉన్నాడు.
వీరి తర్వాత అమన్ మసూద్ (8%), త్రిగుణ్ (7%), కృష్ణుడు (7%) తరువాతి స్థానాల్లో ఉన్నారు. ఈ వారం ఓటింగ్ ఫలితాల్లో అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. టాప్ 6లో ఒక్క మహిళా కంటెస్టెంట్ కూడా లేకపోవడం. ఏడో స్థానంలో ఉన్న సింగర్ ఝాన్సీ (6%),ఎనిమిదో స్థానంలో ఉన్న దేబ్జానీ (6%) మాత్రమే కొంతవరకు ఓట్లు సాధించారు. వీరి తర్వాత జబర్దస్త్ నరేష్ 5%, యాంకర్ వర్షిణి 4%,
టెంపర్ వంశీ 3%, చరణ్, షాలిని, చైత్ర రాయ్ తలా 2%, సృష్టి, యాంకర్ సుధీర్ అత్యంత తక్కువగా 1% ఓటింగ్‌తో అట్టడుగు స్థానంలో ఉన్నారు.
ఎలిమినేషన్ అయ్యేది ఎవరంటే?
తొలివారం నామినేషన్లలో పర్ఫార్మెన్స్ కంటే బయట ఉన్న ఫాలోయింగ్, క్రేజ్ మాత్రమే ఓట్లను రాబడతాయి. ప్రస్తుత ఓటింగ్ లెక్కల ప్రకారం అట్టడుగున ఉన్న యాంకర్ సుధీర్ , సృష్టిలు ఎలిమినేషన్ డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే, వారంలో రాబోయే టాస్కులు, గొడవలు , కంటెస్టెంట్ల బిహేవియర్ ఆధారంగా ఈ ఓటింగ్ మారే ఛాన్స్ ఉంది.
ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..