Headlines

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం భారీ గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకి రూ.15 వేలు.. ఈ సింపుల్ పని చేస్తే చాలు..


కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి లబ్ది చేకూర్చేందుకు, ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి రూ.15 వేల ఆర్ధిక సాయం అందిస్తోంది. ఒక్కసారి మాత్రమే ఇవి అందుతాయి. రెండు విడతలుగా వీటిని కేంద్రం నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇక ఉద్యోగం ఇచ్చే కంపెనీకి ఒక్కొ ఉద్యోగి తరపున రూ.3 వేలు కేంద్రం ఇస్తోంది. దేశంలో ఉద్యోగాల కల్పన పెంచేందుకు, కంపెనీలు ఉపాధి కల్పించేలా ముందుకొచ్చేందుకు ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగులు లబ్దిపొందారు. అయితే ఈ పథకంకు సంబంధించి తాజాగా ఈపీఎఫ్ఓ బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు ఉద్యోగులకు అలర్ట్ జారీ చేసింది.

ఈ పనులు పూర్తి చేస్తేనే అకౌంట్లోకి డబ్బులు

కొత్తగా ఉద్యోగంలో చేరేవారు ఈ పథకం ద్వారా లబ్ది పొందాలంటే ఖచ్చితంగా పీఎఫ్ అకౌంట్ కలిగి ఉండాలి. పీఎఫ్ పరిధిలో ఉన్న కంపెనీలో చేరితే మాత్రమే నగదు అందుతుంది. పీఎఫ్ అకౌంట్ ఉన్నంత మాత్రాన సరిపోదు. ఖచ్చితంగా యూఏఎన్ యాక్టివేట్ చేసుకుంటేనే పథకం కింద లబ్ది పొందుతారని ఈపీఎఫ్ఓ అలర్ట్ జారీ చేసింది. ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియ ద్వారా ఈ ప్రాసెస్ పూర్తి చేయాలని తెలిపింది. ఇదే కాకుండా ఈపీఎఫ్‌ఓకు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్‌కు డీబీటీ సౌకర్యం ఉందా.. లేదా అనేది చెక్ చేసుకోవాలని స్పష్టం చేసింది. డీబీటీ సౌకర్యం లేకపోతే వెంటనే మీ బ్యాంక్ ఖాతాకు అప్డేట్ చేయించుకోవాలని ఈపీఎఫ్ఓ తెలిపింది. ఉద్యోగులు ఈ ప్రక్రియలను పూర్తి చేస్తేనే రూ.15 వేలు అందుతాయని, లేకపోతే సమస్యలు తలెత్తుతాయని అధికారులు సూచిస్తున్నారు. ఈ విషయాన్ని ఈపీఎఫ్ఓ తన ఎక్స్ ఫ్లాట్‌ఫామ్‌లో పేర్కొంది.

తొలి ఏడాదిలోనే అకౌంట్లోకి..

ఇక బ్యాంక్ అకౌంట్‌కు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ పూర్తయి ఉండాలి. ప్రధానమంత్రి వికసిత్ భారత్ పథకాన్ని ఆగస్ట్ 15,2025వ తేదీన ప్రధాని మోదీ ప్రారంభించారు. ఉద్యోగంలో చేరిన తొలి ఏడాదిలో వీటిని అందిస్తారు. రూ.లక్షలోపు జీతం ఉన్నవారికి ఇవి అందుతాయి. ఆందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. పీఎఫ్ అకౌంట్ కలిగి ఉండి వరుసగా ఆరు నెలల పాటు కాంట్రిబ్యూషన్ జమ అయి ఉండాలి. రెండు దఫాలుగా వీటిని ఉద్యోగి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. తొలి విడతలో రూ.8 వేలు, రెండో విడతలో రూ.7 వేలు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *