
బంగారం కొనుగోలుచేసేవారికి బ్యాడ్ న్యూస్. పసిడి ధరలు మరోసారి పెరిగాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తోండగా.. ఇప్పుడు ఒక్కసారిగా బ్రేక్ పడింది. దీంతో కొనుగోలుదారులు నిరాశ చెందుతున్నారు. గత రెండు వారాలుగా గోల్డ్ రేట్లు పడిపోతూ వస్తోండటంతో కాస్త ఊరట చెందగా.. ఇప్పుడు పెరిగి షాకిచ్చాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలే దీనికి కారణంగా చెప్పవచ్చు. అటు యూఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల అంచనాలపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ కారణంతో ధరల్లో ఒడిదోడుకులు చోటుచేసుకుంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాయంగా ధరలు పెరగడంతో.. దేశీయ మార్కెట్లలోనూ పెరుగుదలను నమోదు చేశాయి. ప్రస్తుతం సెప్టెంబర్ 9వ తేదీన దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం.
నేటి బంగారం ధరలు ఇవే..
-దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,55,3601 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,42,410 వద్ద కొనసాగుతున్నాయి
-హైదరాబాద్లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,360 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,410గా ఉంది
-విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం రూ.1,55,360గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,410 వద్ద ట్రేడవుతోంది
-చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,680గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,710 వద్ద ట్రేడవుతోంది
-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,360, 22 క్యారెట్ల రేటు రూ.1,42,410గా ఉంది
-ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,510గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,560 వద్ద కొనసాగుతోంది
వెండి ధరలు ఇవే..
-వెండి ధరలు స్దిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,49,900గా ఉంది.
-హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.2,54,900 వద్ద ట్రేడవుతోంది
-చెన్నైలో కేజీ వెండి ధర రూ.2,54,900గా ఉంది
-బెంగళూరులో కిలో సిల్వర్ ధర రూ.2,49,900 వద్ద కొనసాగుతోండగా.. నిన్న రూ.2.50 లక్షలుగా ఉంది