Headlines

Kumar Kushagra: దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో దుమ్మురేపిన ధోని రాష్ట్రపోడు! సేమ్ ధోనిలానే..


ఈస్ట్ జోన్, సౌత్ జోన్ మధ్య ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆదివారం ప్రారంభమైన మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఈస్ట్ జోన్ ఆటగాడు కుమార్ కుసాగ్రా సెంచరీతో కదం తొక్కాడు. 132 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సులతో 101 పరుగులు చేసి అదరగొట్టాడు. సెంచరీతో చేయడమే కాకుండా ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్‌తో కలిసి ఏకంగా 200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

కుసాగ్రాది ధోని రాష్ట్రమే..

ఎంతో ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీతో ఒక్కసారిగా కుమార కుసాగ్రా పేరు భారత క్రికెట్‌లో మారుమోగే అవకాశం కనిపిస్తోంది. పైగా భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్వయంగా వచ్చి ఈ మ్యాచ్ చూస్తున్న క్రమంలో కుమార కుసాగ్రా ఇంత అద్భుత ఇన్నింగ్స్ ఆడటం అతని కెరీర్‌కు ఎంతో కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. అయితే కుసాగ్రాది జార్ఖండ్ రాష్ట్రం. ఈ పేరు వినగానే సగటు క్రికెట్ అభిమానికి గుర్తుకు వచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోని. భారత క్రికెట్ చరిత్రతో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా చరిత్రలో తన పేరు లిఖించుకున్న ధోని, జార్ఖండ్ రాష్ట్రం నుంచి టీమిండియాకు ఆడిన తొలి క్రికెటర్‌గా అప్పట్లో చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు అతని బాటలోనే చాలా మంది మెరికల్లాంటి క్రికెటర్లు ఆ రాష్ట్రం నుంచి వస్తున్నారు. అందులో కుమార కుసాగ్రా పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. మరో విశేషం ఏంటంటే.. కుమార కుసాగ్రా కూడా ధోనిలానే బ్యాటర్ కమ్ వికెట్ కీపర్.

ఐపీఎల్‌లో ఏ టీమ్‌లో ఉన్నాడంటే..?

కుమార్ కుసాగ్రా 2022లో జరిగిన భారత అండర్-19 ప్రపంచ కప్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. తన తొలి రంజీ సీజన్‌లో, నాగాలాండ్‌తో జరిగిన ప్రీ-క్వార్టర్ ఫైనల్‌లో 269 బంతుల్లో 266 పరుగులు చేసి డబుల్ సెంచరీ సాధించి వార్తల్లో నిలిచాడు. విజయ్ హజరే ట్రోఫీ మ్యాచ్‌లో మహారాష్ట్రపై 36 బంతుల్లో 67 (నాటౌట్) పరుగులు చేసిన కొద్దికాలానికే, 2024 ఐపీఎల్ వేలంలో కుశాగ్రను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7.20 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. 2024 ఐపీఎల్‌లో మూడు ఇన్నింగ్స్‌లలో 0, 1, 2 స్కోర్లతో అతను తన ఐపీఎల్ కెరీర్‌ను నిరాశాజనకంగా ప్రారంభించాడు. 2025 ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్స్ అతన్ని 65 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది.

సెంచరీ పూర్తి చేసుకున్న వీడియో చూడండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *