Hardik Pandya: క్రికెట్ మైదానంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఎప్పుడూ వార్తల్లో ఉండే హార్దిక్ పాండ్యా చుట్టూ కొత్త వివాదం చేరింది. ఇటీవల ఒక స్టార్ హోటల్‌లో జరిగిన విందులో బాలీవుడ్ నటి అమీషా పటేల్ పాల్గొంది. ఆ సమయంలో తన స్నేహితులకు హార్దిక్ పాండ్యాను పరిచయం చేస్తూ నటి అతడి భుజంపై సాధారణంగా చేయి వేసింది. ఈ సన్నివేశాన్ని ఒక నెటిజన్ ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ “రెడ్డిట్‌లో వస్తున్న రూమర్లు నిజమే కాబోలు, వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంది” అంటూ కామెంట్ జోడించాడు. దాంతో ఈ వార్త క్షణాల్లో వైరల్‌గా మారింది.
ట్రోలర్‌కు అమీషా పటేల్ సటైరికల్ కౌంటర్
ఈ అనవసరపు గాసిప్స్‌పై నటి అమీషా పటేల్ తీవ్రంగా స్పందించారు. సదరు నెటిజన్ చేసిన పోస్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ అత్యంత హాస్యస్పదంగా, ఘాటైన వ్యాఖ్యలతో బదులిచ్చారు. “ఔను, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు! నేను అతడి భుజంపై చేయి వేసిన విధానం నిజంగానే ప్రేమతో కూడుకున్నది! నాకు నువ్వు ఎవరో తెలియదు కానీ, నీకు ఇప్పటివరకు ఒక్క అమ్మాయి కూడా ఫ్రెండ్ లేదని అర్థమవుతోంది. ఇలాంటి పోస్ట్‌లు పెట్టే ముందు ఒక అమ్మాయితో స్నేహం చేయడం నేర్చుకో” అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ సమాధానంతో హార్దిక్, అమీషాల మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని తేలిపోయింది.
The way Ameesha Patel put her hand on Hardik Pandya’s shoulder during the party at a hotel in Bengaluru. 👀
All the Reddit rumours seem to be coming true. pic.twitter.com/VJ7945fHus
— Sonu (@Cricket_live247) September 5, 2026
హార్దిక్ పాండ్యా మహీకా శర్మ బంధం
ఇప్పటికే హార్దిక్ పాండ్యా నటి మహీకా శర్మతో ప్రేమాయణంలో ఉన్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. గతంలో నటాషా స్టాంకోవిచ్‌తో వివాహం, ఆ తర్వాత విడాకుల నుంచి హార్దిక్ లైఫ్‌స్టైల్ నిరంతరం చర్చనీయాంశమవుతోంది. నటి ఎల్లి అవ్రామ్‌తో పాటు పలువురు మోడళ్లతో హార్దిక్ పేరు వినిపించింది. 2024 జూలై నాటికి నటాషాతో అధికారికంగా విడిపోయిన తర్వాత, మోడల్ మహీకా శర్మతో అతడు పలు సందర్భాల్లో కలిసి కనిపించాడు. మైదానంలో మ్యాచ్‌లు జరిగే వేళ కూడా మహీకా స్టేడియంలో సందడి చేస్తూ కనిపించేది.
లగ్జరీ లైఫ్‌కు కేరాఫ్ అడ్రస్
మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో, బయట కూడా హార్దిక్ అంతే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతాడు. రోల్స్ రాయిస్ ఫాంటమ్, ఫెరారీ, లంబోర్గిని వంటి ఖరీదైన కార్ల కలెక్షన్ అతడి సొంతం. రూ.300 కోట్లకు పైగా విలువైన రోలెక్స్, పటేక్ ఫిలిప్ వంటి లగ్జరీ గడియారాల కలెక్షన్ హార్దిక్ వద్ద ఉంది. ముంబైతో పాటు వడోదరలో అతడికి లగ్జరీ ఇళ్లు ఉన్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..