Headlines

Bigg Boss 10 Buzz: ఈసారి ఆట కాదు వేట.. బిగ్ బాస్ 10 బజ్ హోస్ట్ గా మళ్లీ శివాజీనే.. కంటెస్టెంట్లకు చుక్కలే


అనుకున్నదే అయ్యింది. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, ప్రముఖ నటుడు శివాజీ మళ్లీ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టారు. ఏడో సీజన్ లో తన దైన ఆట, మాట తీరు, పంచ్‌లతో అలరించిన ఆయన ఈసారి కూడా ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేయనున్నారు. అయితే కంటెస్టెంట్ గా కాదు.. గత సీజన్ లో బిగ్ బాస్ బజ్ లో ఎలిమినేటెడ్ కంటెస్టెంట్లకు చుక్కలు చూపించి నిజాలు రాబట్టిన శివాజీ మరోసారి బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. తాజాగా ఈ సీజన్ కు సంబంధించిన బిగ్ బాజ్ 10 బజ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఇది ఆట కాదు.. వేట’ అంటూ సాగే ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో బిగ్ బాస్ జర్నీ, నిజం అంటూ తూకం వేసే శివాజీ కొత్తగా కనిపించారు. కాగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ బయటకు రాగానే ఫస్ట్ ఇంటర్వ్యూ చేసేందుకు బిగ్ బాస్ బజ్ అనే ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు. గతంలో ప్రతి సీజన్ కు ఈషోకు హోస్ట్ లు మారుతూ వచ్చారు. ఒక్కోసారి ఆయా సీజన్ లోని స్టార్ కంటెస్టెంట్లు తర్వాతి సీజన్ బిగ్ బాస్ బజ్ కు హోస్ట్ లుగా చేశారు. గతంలో రాహుల్ సప్లిగంజ్, అరియానా, గీతూ రాయల్, అంబటి అర్జున్ లాంటి వాళ్లు ఈ షోలను హోస్ట్ చేశారు. కానీ శివాజీ మాత్రం వరుసగా హోస్ట్ గా కొనసాగుతుండటం విశేషం.

స్టార్ మా మ్యూజిక్‌లో డబుల్ ధమాకా
కాగా ముందు రోజు రాత్రి వచ్చిన బిగ్ బాస్ ఎపిసోడ్ తో పాటు కాస్త కంటెంట్ పొడిగించి తర్వాతి రోజు స్టార్ మా మ్యూజిక్ లో రిపీట్ చేస్తున్నారు. బిగ్ బాస్ 10 సీజన్ లోనూ ఇది కొనసాగుతుంది. సెప్టెంబర్ 7వ తేదీ సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ బిగ్ బాస్ బజ్ షో.. ప్రతిరోజూ రెండు వేర్వేరు సమయాల్లో టెలికాస్ట్ కానుంది. ​ఉదయం 10:00 గంటలకు, సాయంత్రం 6:00 గంటలకు ఒకసారి ఈ బిగ్ బాస్ బజ్ అన్‌ఫిల్టర్డ్ ఎపిసోడ్లు ప్రసారమవుతాయి.

కాగా ​బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చే కంటెస్టెంట్ల ఇంటర్వ్యూలకు యూట్యూబ్, సోషల్ మీడియాలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇదే క్రమంలో డేర్ అండ్ డ్యాషింగ్ అయిన శివాజీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను హాట్ సీట్ లో కూర్చొబెట్టి వారి నుంచి నిజాలు రాబట్టే తీరు ఎంతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇది బిగ్ బాస్ షో వ్యూయర్ షిప్ ను మరింత పెంచుతుందని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి



బిగ్ బాస్ 10 బజ్ ప్రోమో ఇదిగో..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *