Headlines

Tim Cook Net Worth: యాపిల్ మాజీ సీఈవో నికర ఆస్తి విలువ ఎంత? యాపిల్ నుంచి తప్పుకున్నాక ఆయన కొత్త రోల్ ఏంటి?


Apple CEOగా దాదాపు 15 సంవత్సరాల పాటు కంపెనీని నడిపించిన టిమ్ కుక్ పదవీకాలం ముగిసింది. 2026 ఆగస్టు 31 CEOగా ఆయన చివరి రోజు సేవలు పూర్తయ్యాయి. అయితే, టిమ్ కుక్ Apple కంపెనీ నుంచి పూర్తిగా తప్పుకోవడం లేదు. ఆయన కంపెనీలో కొత్తగా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బాధ్యతలు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 1 నుంచి జాన్ టర్నస్ Apple కొత్త CEOగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో మాజీ సీఈవో టిమ్ కుక్ నికర ఆస్తి విలువ ఎంత ఉందో తెలుసుకుందాం.

టిమ్ కుక్ నికర ఆస్తి విలువ వివరాలు:

ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, టిమ్ కుక్ మొత్తం నికర ఆస్తి విలువ దాదాపు 3 బిలియన్ డాలర్లు అని సమాచారం. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ. 26 వేల కోట్లకు సమానమని చెప్పవచ్చు. ఆయన ఆస్తిలో ప్రధాన భాగం Apple నుంచి వచ్చిన షేర్లు, జీతం, ఇతర చెల్లింపుల ద్వారా సమకూర్చుకున్నారు. టిమ్ కుక్ వద్ద Apple సంస్థకు చెందిన 30 లక్షలకు పైగా షేర్లు ఉన్నాయి. కంపెనీ షేర్ ధరల్లో వచ్చే హెచ్చుతగ్గులను బట్టి ఆయన మొత్తం ఆస్తి అంచనా సైతం ఎప్పటికప్పుడూ మారుతుంటుంది. అందుకే టిమ్ కుక్ నికర ఆస్తి విలువ కాలక్రమేణా పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది.

15 ఏళ్ల పాటు Apple సీఈవోగా బాధ్యతలు

ఆగస్టు 2011లో టిమ్ కుక్ Apple CEOగా బాధ్యతలు చేపట్టారని తెలిసిందే. యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ తర్వాత ఆయన ఈ బాధ్యతను చేపట్టారు. టిమ్ కుక్ నాయకత్వంలో Apple సంస్థ iPhoneతో పాటు యాపిల్ వాచ్ (Apple Watch), ఎయిర్ పాడ్స్, ఇతర విభిన్న సేవల్లో కంపెనీని ముందుకు తీసుకెళ్లింది.

టిమి కుక్ హయాంలో ఆపిల్‌ ప్రపంచంలోనే అత్యంత పెద్ద, విలువైన టెక్ కంపెనీలలో ఒకటిగా నిలిచింది. కంపెనీ వ్యాపారంతో పాటు సప్లై చైన్, ఇతర కీలక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడంతో టిమ్ కుక్ మంచి పేరు ప్రతిష్టలు సంపాదించారు.

Apple కొత్త సీఈవో ఎవరు?

Apple సంస్థ 2026 ఏప్రిల్‌లోనే నాయకత్వ మార్పును తెలిపింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, జాన్ టర్నస్ 2026 సెప్టెంబర్ 1న Apple CEOగా బాధ్యతలు చేపడతారు. టర్నస్ ప్రస్తుతం యాపిల్ కంపెనీ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

టిమ్ కుక్ ఇకపై ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా Appleలోనే పనిచేస్తారు. ఆయన కంపెనీ బోర్డు, ఇతర బాధ్యతలతో కలిసి పనిచేస్తారు. అలాగే, తన అనుభవంతో ఆపిల్‌ భవిష్యత్ వ్యూహాల రూపకల్పనలో కీలకపాత్ర పోషించనున్నారు. CEOగా తన చివరి రోజున టిమ్ కుక్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌ చేశారు. తన ఎక్స్ ఖాతాలో.. తన చివరి రోజు గురించి ప్రస్తావించారు. యాపిల్ CEOగా తన హోదా ఇక మారుతుందని, కానీ ఆపిల్ కమ్యూనిటీ పట్ల తన ప్రేమ ఎప్పటికీ మారదని స్పష్టం చేశారు.

తన ఈ పోస్ట్‌లో కుక్ ఇలా రాశారు, “CEOగా నా చివరి రోజున ఆపిల్ కమ్యూనిటీకి బోలెడంత ప్రేమ. రేపు నా హోదా మారుతుంది. కానీ ఆపిల్ కమ్యూనిటీ పట్ల నాకున్న ప్రేమ ఎప్పటికీ మారదు. ఎల్లప్పుడూ నాకు ప్రేరణగా నిలిచినందుకు చాలా ధన్యవాదాలు. నా కృతజ్ఞతలు అపారమైనవి, నా జీవితంలోని తదుపరి అధ్యాయం కోసం నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. అని చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: SBI: ఎస్‌బీఐలో పిల్లల కోసం అద్భుతమైన స్కీమ్‌.. ఐదేళ్లు కడితే చాలు.. చేతికి రూ.45 లక్షలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *