Headlines

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 10లో మొత్తం 16 మంది కంటెస్టెంట్స్.. పేర్లు లీక్ చేసిన ఆది రెడ్డి


బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ కొత్త సీజన్ మరికొన్ని గంట్లలో ప్రారంభం కానుంది. తెలుగులో విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు పదో సీజన్ కోసం అట్టహాసంగా ముస్తాబైంది. ఇవాళ (సెప్టెంబర్ 06) సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అధికారికంగా ప్రారంభం కానుంది. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి ఈ రియాలిటీ షోపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇక బిగ్ బాస్ 10 కంటెస్టెంట్స్ ఎవరన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. సోషల్ మీడియాలో అయితే చాలా మంది ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆది రెడ్డి సీజన్ 10కు సంబంధించిన అప్టేట్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నాడు. గతంలోనూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తదితర వివరాలకు సంబంధించి ఆది రెడ్డి అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా బిగ్ బాస్ సీజన్ 10 గురించి పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు.

ఆది రెడ్డి అంచనా ప్రకారం.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ ఉండనున్నారు. ఇందులో 10 మంది మేల్ కంటెస్టెంట్స్ కాగా ఆరుగురు ఫిమేల్ కంటెస్టెంట్స్. ఇక ఈ సీజన్ లో హౌస్ లోకి అడుగు పెట్టే మొదటి కంటెస్టెంట్ల పేర్లను కూడా అంచనా వేశాడు ఆది రెడ్డి. దీని ప్రకారం

1. సీరియల్ నటి దేబ్జానీ మోదక్

ఇవి కూడా చదవండి



2. చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంలో సెకండ్ హీరోగా నటించిన అదిత్ ఈశ్వరన్

3. సింగర్ ఝాన్సీ- అగ్ని పరీక్ష సీజన్ 2 కంటెస్టెంట్

4. సుధీర్ రెడ్డి – పోడ్‌కాస్టర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్

5. అమన్ మసూద్- పాడ్ కాస్టర్, అగ్ని పరీక్ష సీజన్ 2 కంటెస్టెంట్

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నారు. కొన్ని రోజుల క్రితమే బిగ్ బాస్ కంటెస్టెంట్ల జాబితాపై ఒక వీడియోను రిలీజ్ చేశాడు ఆది రెడ్డి. అందులోనూ ఈ పేర్లు ఉన్నాయి. వీరితో పాటు సీరియల్ నటుడు ముఖేష్ గౌడ అలియాస్ రిషి, రోహిత్ (కామనర్), వినాయకుడు మూవీ హీరో కృష్ణుడు, శాలినీ, జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్, టెంపర్ వంశీ, సృష్టి వ్యాకరణం , ఆర్జే చరణ్, యాంకర్ వర్షిణీ సౌందర రాజన్, ‘జబర్దస్త్’ నరేష్ , ప్రముఖ సీరియల్ నటి చైత్ర రాయ్ తదితరులు హౌస్ లోకి రానున్నారని అంచనా వేశాడు ఆదిరెడ్డి. మరి ఇందులో ఎవరు వస్తారో తెలియాలంటే ఇవాళ్టి సాయంత్రం దాకా వేచి చూడాల్సిందే

Bigg Boss Telugu 10, Adi Re

Bigg Boss Telugu 10, Adi Reddy Prediction

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *