Headlines

Telangana: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలోనే అకౌంట్లోకి డబ్బులు.. ప్రభుత్వం అప్డేట్..


Telangana: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలోనే అకౌంట్లోకి డబ్బులు.. ప్రభుత్వం అప్డేట్..

తెలంగాణలోని రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. వర్షాకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. అక్టోబర్ 15 నుంచి వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఈ సారి సీజన్‌లో 65 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు రూ.18,250 కోట్ల విలువ గల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతులకు ఇబ్బంది జరగకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సకాలంలో ధాన్యాన్ని కొంటామని స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ముందే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. తాజాగా ధాన్యం కొనుగోళ్లపై జిల్లాల అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులతో హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్ధలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రవ్యాప్తంగా 8283 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 3180 ఐకేపీ కేంద్రాలు, 4372 ప్రాధమిక వ్యవసాయ సహకార కేంద్రాలు, 731 ఇతర కేంద్రాల్లో కొనుగోలు జరగనున్నాయి. అక్టోబర్ 1 నాటికి వీటిని సిద్దం చేయాలని నిర్ణయించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక గోదాంలు, గన్నీ సంచులు, రవాణా వాహనాలు, హమాలీలు, తూకం యంత్రాలతో పాటు నాణ్యత నిర్ధారణ పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎక్కువసేపు ఉండకుండా ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

గ్రేడ్ ఏ రకానికి క్వింటాల్‌కు రూ.2461, సాధారణ రకం ధాన్యానికి రూ.2441 చెల్లించనున్నట్లు తెలిపారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఏడు సన్న రకం ధాన్యానికి అదనంగా క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ అందించనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. బీపీటీ-5204, ఆర్‌ఎన్‌ఆర్‌-15048, కేఎన్‌ఎం-1638, జైశ్రీరామ్‌, హెచ్‌ఎంటీ-సోనా, డబ్ల్యూజీఎల్‌-44, కేఎన్‌ఎం-7715 రకాల ధాన్యం రకానికి బోనస్ అందుతుందని స్పష్టం చేశారు. విత్తనాలు కొనుగోలు చేసినప్పుడే డీలర్ల వద్ద విత్తన రకాన్ని రైతులు నమోదు చేసుకోవాలి. డీలర్లు బాధ్యతు తీసుకుని విత్తన రకాలను నమోదు చేయాలి. ప్రభుత్వం రైతులకు బోనస్ డబ్బులు అందుతాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *