Headlines

Actress Jaya Prada: నటనకే నటన నేర్పిన మహానటుడు.. అద్భుతమైన వ్యక్తి ఆయన.. జయ ప్రద..


నటి జయప్రద ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మహానటుడు నందమూరి తారక రామారావు గారి గురించి తన అనుభవాలను, ఆయను గొప్పదనాన్ని పంచుకున్నారు. ఎన్టీఆర్ గారితో కలిసి అనేక చిత్రాలలో నటించిన జయప్రద, ఆయనను కేవలం ఒక నటుడిగా కాకుండా, నటనకు నటన నేర్పిన ఒక మహానుభావుడిగా తెలిపారు. ఎన్టీఆర్ గారు పోషించిన పాత్రల వైవిధ్యాన్ని జయప్రద ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఒక కృష్ణుడి పాత్రలో అవ్వచ్చు, దుర్యోధనుడి పాత్రలో అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామిగా అవ్వచ్చు, లేదా యముడిగా అవ్వచ్చు – ఏ పాత్రలోనైనా ఆయన పూర్తిగా లీనమైపోయేవారని, ఆ పాత్రకు జీవం పోసి తనే ఆ పాత్రగా మారిపోయేవారని ఆమె ప్రశంసించారు. అటువంటి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడే అవకాశం లభించినందుకు తాను సంతోషంగా ఉన్నానని జయప్రద తెలిపారు.

ఎన్టీఆర్ గారి వ్యక్తిత్వంలోని కొన్ని అరుదైన, గొప్ప లక్షణాలను జయప్రద ప్రత్యేకంగా వివరించారు. ఆయన ఎప్పుడూ ఎవరినీ నువ్వు అని ఏకవచనంలో సంబోధించేవారు కాదని, చిన్న సెట్ బాయ్ నుండి ప్రధాన తారాగణం వరకు అందరినీ మీరు లేదా తమరు అని గౌరవంగా పిలిచేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆయనను తాను కూడా మేం అని సంబోధించేవారని, “ఏం జయప్రద గారు చెప్పండి” అని ఆయన తనతో మాట్లాడేవారని జయప్రద చెప్పారు. ఇది చాలా అరుదైన లక్షణమని, చాలా తక్కువ మందిలో మాత్రమే ఇటువంటి గౌరవ మర్యాదలు కనిపిస్తాయని ఆమె అన్నారు. సెట్‌లో ఏ మూడ్‌లో ఉన్నా కూడా, చిన్న ఆర్టిస్ట్‌లతో కూడా ఆయన ఏమండీ అని పలకరించేవారని జయప్రద తెలిపారు.

ఎన్టీఆర్ గారి క్రమశిక్షణ గురించి వివరిస్తూ, ఆయన దినచర్య చాలా కఠినంగా ఉండేదని జయప్రద వెల్లడించారు. తెల్లవారుజామున 2 గంటలకే నిద్రలేవడం, 3 గంటలకు వ్యాయామం చేయడం, ఆ తర్వాత పూజ చేసుకోవడం ఆయన దినచర్యలో భాగంగా ఉండేవని చెప్పారు. అంతేకాకుండా, షూటింగ్ సెట్‌కు సకాలంలో హాజరవడం విషయంలో ఆయనకు ఎంతో నిబద్ధత ఉండేదని తెలిపారు. ఉదయం 7:30 గంటలకు కాల్ టైం అయితే, ఆయన కనీసం ఐదు నిమిషాల ముందే, అంటే 7:25 గంటలకే సెట్‌లో ఉండేవారని జయప్రద గుర్తు చేసుకున్నారు. యూనిట్ సభ్యులు కూడా అప్పటికి వచ్చి ఉండేవారు కాదని, ఆయన ఒక కుర్చీ వేసుకుని ప్రశాంతంగా కూర్చుని ఉండేవారని వివరించారు.

కృష్ణుడు లేదా దుర్యోధనుడు వంటి పాత్రలు పోషించేటప్పుడు, విగ్గులు, కిరీటాలు పెట్టుకుని సెట్‌లో గంటల తరబడి అలాగే ఉండేవారని, సాధారణంగా బ్రేక్ సమయంలో నటులు విగ్గులు, కిరీటాలు తొలగించి విశ్రాంతి తీసుకుంటారని, కానీ ఎన్టీఆర్ గారు ఆ పని చేసేవారు కాదని ఆమె అన్నారు. ఆయనకు పాత్ర అంటే కేవలం ఒక వేషం కాదని, అది తపస్సు అని, అదే సర్వస్వం అని భావించేవారని జయప్రద వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *