Headlines

NIMS: ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. నిమ్స్‌లో ఉచితంగానే EHS ఓపీ సేవలు


NIMS: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. నిమ్స్ ఆస్పత్రిలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద అవుట్ పేషెంట్ సేవలను ఉచితంగా అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ఈ మేరకు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్‌కు స్పష్టమైన సూచనలు చేశారు.

కొత్త గైడ్‌లైన్స్ ఉన్నప్పటికీ మినహాయింపు

ఈహెచ్‌ఎస్ కొత్త నిబంధనల ప్రకారం నెట్‌వర్క్ హాస్పిటళ్లలో కేవలం ఇన్‌పేషెంట్ సేవలు, వెల్‌నెస్ సెంటర్లలో మాత్రమే ఓపీ సేవలు అందించాల్సి ఉంది. అయితే ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిమ్స్ ఆస్పత్రిలో మాత్రం ఉచిత ఓపీ సేవలను యథావిధిగా కొనసాగించాలని మంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్రంలో విస్తరిస్తున్న వెల్‌నెస్ సెంటర్లు

ఉద్యోగులకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 12 వెల్‌నెస్ సెంటర్లు సేవలందిస్తుండగా, ప్రభుత్వం తాజాగా మరో 24 కొత్త సెంటర్లను మంజూరు చేసింది.
ఇప్పటివరకు వెల్‌నెస్ సెంటర్లు లేని అన్ని జిల్లా కేంద్రాల్లో వీటిని ప్రారంభించే ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది.రాజధాని హైదరాబాద్‌లో మరో 3 కొత్త వెల్‌నెస్ సెంటర్లను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది.

జనరల్ హాస్పిటళ్లకు అనుసంధానిస్తూ వెల్‌నెస్ సెంటర్లలోనూ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగుల కుటుంబాలకు మెరుగైన ఉచిత వైద్యం అందనుంది.

ఇది కూడా చదవండి: SBI: ఎస్‌బీఐలో పిల్లల కోసం అద్భుతమైన స్కీమ్‌.. ఐదేళ్లు కడితే చాలు.. చేతికి రూ.45 లక్షలు!

ఇది కూడా చదవండి: SBI Amrit Vrishti: జస్ట్ 15 నెలల డిపాజిట్‌ చేస్తే చాలు.. అదిరిపోయే రాబడి.. ప్రాసెసింగ్‌ ఏంటి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *