Headlines

బుర్ర పాడు టేస్ట్ మావ.. కీమా దోశ ధర ఇంత తక్కువా..? ఎక్కడంటే..?


విజయవాడ నుంచి వైజాగ్ వెళ్లే మార్గంలో, లేదా వైజాగ్ నుంచి విజయవాడకు ప్రయాణించేటప్పుడు, యర్రవరం సమీపంలోని యస్.తిమ్మాపురం అనే గ్రామంలో ఒక ప్రత్యేకమైన రుచి గల టిఫిన్స్ అందించే చిన్న పాక ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం కట్టెల పొయ్యి మీద తయారుచేసే మటన్ కీమా పెసరట్లకు పేరు పొందింది. ఇక్కడ ఇంట్లో వాళ్లే స్వయంగా రుబ్బుకున్న పిండితో పెసరట్లు వేస్తారు. కట్టెల పొయ్యిపై చేసే ఈ పెసరట్ల రుచి ఎంతో అద్భుతంగా ఉంటుందని చెబుతారు. ఈ ప్రదేశానికి వెళ్ళే వారు తమకు కావాల్సిన మటన్ కీమాను తీసుకెళితే, దాన్ని ప్రత్యేకంగా తవా ఫ్రై చేసి పెసరట్టులో కలిపి అందిస్తారు. పక్కనే మటన్ షాపు కూడా అందుబాటులో ఉంటుంది.

పెసరట్టు తయారీ విధానం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ముందుగా పెసరట్టు పిండి వేసి, దానిపై ఉల్లిపాయలు పెట్టి, మళ్ళీ పిండి వేసి, చివరిగా ఉడపప్పు వేస్తారు. మటన్ కీమాతో పెసరట్టు తయారుచేయడానికి, కైమాను ముందుగా మసాలాలతో వేయించి, ఆపై పెసరట్టు పిండితో కలిపి దాదాపు 15 నుండి 20 నిమిషాల పాటు కాల్చుతారు. ఈ సాధారణ పెసరట్టు ధర కేవలం రూ. 15 కాగా, మటన్ కైమా పెసరట్టు ధర రూ. 20 మాత్రమే. గుర్తుంచుకోండి పక్కన ఉన్న మటన్ షాపు నుంచి కీమా మనమే తెచ్చుకోవాలి. వాళ్లు దానికి మసాలాలు యాడ్ చేసి.. దోశలో పెట్టి ఇస్తారు. అలా అయినా సరే దోశ చాలా తక్కువ ధరే.  ఈ అద్భుతమైన రుచిని అందించడానికి వారు పడే కృషి, వారు అందించే తక్కువ ధరలు ప్రశంసనీయం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *