Headlines

Jasprit Bumrah: బుమ్రా ఫెయిల్ అయితే అతడే రీప్లేస్‌మెంట్.. బీసీసీఐ మైండ్ బ్లోయింగ్ ప్లాన్ బి రెడీ


Jasprit Bumrah: అఫ్గానిస్థాన్‌తో త్వరలో జరగబోయే మూడు టీ20ల సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా ఎంపికైనప్పటికీ అతడు బరిలోకి దిగడంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. బీసీసీఐ నిర్వహించే కీలక ఫిట్‌నెస్ పరీక్షలో కనుక బుమ్రా విఫలమైతే అతడి స్థానంలో యువ ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవడానికి సెలెక్టర్లు సంచలన ప్లాన్ సిద్ధం చేశారు. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ పై బీసీసీఐ అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభమయ్యే అఫ్గానిస్థాన్ టి20 సిరీస్‌తో పాటు రాబోయే ఆసియా క్రీడలను దృష్టిలో ఉంచుకుని వైద్య బృందం నివేదిక కోసం సెలెక్టర్లు ఎదురుచూస్తున్నారు. మెడికల్ టీమ్ ఇచ్చిన సమాచారం ప్రకారం బుమ్రా కోలుకున్నప్పటికీ, అసలు మ్యాచ్ తరహా ఒత్తిడిని తట్టుకోగలడో లేదో తెలుసుకోవడానికి ప్రత్యర్థి జట్లతో కాకుండా ప్రాక్టీస్ మ్యాచ్‌లలో పరిశీలించడం తప్పనిసరిగా మారింది.

సీఓఈ ఆధ్వర్యంలో మ్యాచ్ సిమ్యులేషన్ టెస్ట్

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం జస్ప్రీత్ బుమ్రా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలకు ఈ వారంలో స్పెషల్ మ్యాచ్ సిమ్యులేషన్ టెస్టులు నిర్వహించనున్నారు. ఢిల్లీలో టీమిండియా క్యాంప్‌లో చేరడానికి ముందే ఈ ప్రాక్టీస్ పోరు జరగనుంది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) సెప్టెంబర్ 4 నుంచి 9 వరకు ఈ ప్రత్యేక మ్యాచ్‌లను షెడ్యూల్ చేసింది. ఇందులో బుమ్రా తన పూర్తి స్థాయి బౌలింగ్ సామర్థ్యాన్ని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది.

బ్యాకప్‌గా సిద్ధంగా ఉన్న ప్రిన్స్ యాదవ్

ఒకవేళ బుమ్రా ఈ ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమైతే అతడి స్థానంలో యంగ్ స్పీడ్‌స్టర్ ప్రిన్స్ యాదవ్‌ను మైదానంలోకి దించేందుకు సెలెక్టర్లు ఇప్పటికే పచ్చజెండా ఊపారు. జూలై 25న జింబాబ్వేపై జరిగిన రెండో టీ20 మ్యాచ్ సమయంలో ప్రిన్స్ యాదవ్ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. ప్రస్తుతం అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించి బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. బుమ్రా అందుబాటులోకి రాకపోతే ప్రిన్స్ యాదవ్‌కు నేరుగా తుది జట్టులో అవకాశం దక్కనుంది.

ఢిల్లీ వేదికగానే మూడు టీ20 పోరు

అఫ్గానిస్థాన్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ సెప్టెంబర్ 13న ఘనంగా ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరగడం విశేషం. స్వదేశంలో జరుగుతున్న ఈ సిరీస్ ద్వారా ప్రధాన ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను పరీక్షించి ఆసియా క్రీడలకు బలమైన జట్టును సిద్ధం చేయాలని బోర్డు యోచిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *