Headlines

Rajinikanth Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ విడుదల వాయిదా? అసలు విషయం చెప్పేసిన మేకర్స్


సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘జైలర్ 2’ విడుదల తేదీ వాయిదా పడుతుందని, సినిమాలోని పలు భాగాలను తిరిగి చిత్రీకరిస్తున్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో రజనీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. తాజాగా ఈ ప్రచారంపై ‘సన్ పిక్చర్స్’ నిర్మాణ సంస్థ స్వయంగా స్పష్టతనిచ్చింది. ఈ చిత్రం అక్టోబర్ 15న ఘనంగా విడుదల కానుందని క్లారిటీ ఇచ్చింది. తాజాగా తమ అధికారిక ‘X’ (ట్విట్టర్) ఖాతాలో జైలర్ సినిమాకు సంబంధించిన ఒక కొత్త పోస్టర్‌ను పంచుకుంటూ, సినిమా విడుదల వాయిదా పడలేదని సన్ పిక్చర్స్ ధృవీకరించింది. పోస్టర్‌తో పాటు, ‘ఈ చిత్రం అక్టోబర్ 15న తెరపైకి రానుంది’ అని రాసింది. ఈ చిత్రం దసరా పండుగ సెలవుల్లో విడుదలవుతున్నందున, తొలి వారాంతంలో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన కంటెంట్ రజనీకాంత్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ తో కూడిన టీజర్ కు యూట్యూబ్ లో భారీగా రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆగస్టులో, అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ‘ఆలా బొలేలో’ సాంగ్ విడుదలైంది. తెలుగు హీరోయిన్ పూర్ణ ఇందులో నటించడం గమనార్హం. అలాగే ఈ సాంగ్ లో రజనీకాంత్ మాస్ లుక్ ను అభిమానులు ఎంతగానో ఇష్టపడ్డారు.

నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో, కలానిధి మారన్ (సన్ పిక్చర్స్) నిర్మించిన ఈ చిత్రం, 2023లో వచ్చిన సూపర్ హిట్ ‘జైలర్’ చిత్రానికి సీక్వెల్. రజనీకాంత్, రమ్యకృష్ణన్ మళ్లీ భార్యాభర్తలుగా కనిపించనుండగా, యోగి బాబు, మీర్నా, రిత్విక్ తమ పాత్రలలో కొనసాగుతున్నారు. మొదటి భాగంలోని మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్‌లతో పాటు, ఈసారి ఎస్.జె. సూర్య, మిథున్ చక్రవర్తి, విద్యా బాలన్, సూరజ్ వెంజరమూడు తదితరులు ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈసారి బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కూడా ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి



సన్ పిక్చర్స్ సంస్థ ట్వీట్..

అల బోలెలో సాంగ్…


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *