Headlines

Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్‌? భారీగా తగ్గిన పసిడి ధర


గత కొన్ని రోజులుగా ఆల్‌టైమ్ రికార్డు ధరలతో వినియోగదారులను ఆందోళనకు గురిచేసిన పసిడి మార్కెట్‌లో సెప్టెంబర్‌ 2, బుధవారం ఊహించని విధంగా భారీ పతనం నమోదైంది. అంతర్జాతీయ విపణిలో తలెత్తిన ఒత్తిడి, ఫెడరల్ రిజర్వ్ వ్యాఖ్యల కారణంగా ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకరణకు దిగడంతో దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,070లు తగ్గి రూ.1,52,020 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం రూ.1900 తగ్గి రూ.1,39,350 లకు చేరింది. కేజీ రూ.2,50,000 తో వెండిధర స్థిరంగా కొనసాగుతోంది. సెప్టెంబర్‌ 2, బుధవారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు పరిశీలిస్తే.. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,170 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,39,500 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,52,020 లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,350 పలుకుతోంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,52,020, అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,39,350 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,020 లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,350 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.2,50,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు.. తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌ చేసుకొని వెళితే మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బైక్‌పై ప్రేయసి కూర్చుంటే.. మేఘాలలో తేలిపోవడమే!

నేపాల్‌ వరదల్లో కొట్టుకుపోయిన ఇళ్లు.. యజమాని కుటుంబం కోసం ఎదురుచూస్తున్న శునకం

ఒకే ఒక్క పాట.. 5 కోట్ల వ్యూస్‌.. చివరికి సింగర్‌ ప్రాణాన్ని తీసేసింది ఇలా!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *