Headlines

బైక్‌పై ప్రేయసి కూర్చుంటే.. మేఘాలలో తేలిపోవడమే!


బైక్‌పై ప్రియురాలు వెనుక కూర్చుంటే ఆ ఉత్సాహమే వేరుగా ఉంటుందని, అది డ్రైవింగ్‌పై ప్రభావం చూపుతుందని మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఓ రోడ్డు ప్రమాద కేసు విచారణలో భాగంగా కోర్టు ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. 2018 మే 10న తేని జిల్లాకు చెందిన 19 ఏళ్ల గోపాల్, తన ప్రియురాలు రాజేశ్వరితో కలిసి బైక్‌పై ప్రయాణిస్తున్నాడు. వీరపాండి-వాయల్‌పట్టి మార్గంలో అర్ధరాత్రి సమయంలో వారి బైక్‌ను ఓ వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో గోపాల్ అక్కడికక్కడే మృతి చెందగా, రాజేశ్వరి గాయపడ్డారు. దీంతో గోపాల్ తల్లిదండ్రులు పరిహారం కోసం తేని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ట్రైబ్యునల్, 2021లో మృతుడి కుటుంబానికి రూ. 25.5 లక్షలు చెల్లించాలని బీమా సంస్థను ఆదేశించింది. ఈ తీర్పుపై బీమా సంస్థ హైకోర్టులో అప్పీల్ చేసింది. పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్, జస్టిస్ ఎం.డి.సుమతిల ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. “ప్రియురాలు వెనుక కూర్చున్నప్పుడు ఏ రైడర్‌కైనా ఉత్సాహం రావడం సహజం” అని పేర్కొన్న కోర్టు, ప్రమాదంలో మృతుడికి కూడా 25 శాతం పాక్షిక బాధ్యత ఉందని తేల్చింది. రాత్రి సమయంలో కుడివైపు బైక్ నడపడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ట్రిబ్యునల్ విధించిన పరిహారాన్ని తగ్గించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నేపాల్‌ వరదల్లో కొట్టుకుపోయిన ఇళ్లు.. యజమాని కుటుంబం కోసం ఎదురుచూస్తున్న శునకం

ఒకే ఒక్క పాట.. 5 కోట్ల వ్యూస్‌.. చివరికి సింగర్‌ ప్రాణాన్ని తీసేసింది ఇలా!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *