Headlines

Super Star Krishna : ఆ హీరో క్రేజ్ చూసి ఆశ్చర్యపోయా.. ఆయనను చూసే సినిమాల్లోకి రావాలనుకున్నాను.. సూపర్ స్టార్ కృష్ణ..

Super Star Krishna : ఆ హీరో క్రేజ్ చూసి ఆశ్చర్యపోయా.. ఆయనను చూసే సినిమాల్లోకి రావాలనుకున్నాను.. సూపర్ స్టార్ కృష్ణ..


సూపర్ స్టార్ కృష్ణ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి నెట్టింట వైరలవుతున్నాయి. తన సినీ ప్రస్థానాన్ని, వ్యక్తిగత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను పంచుకున్నారు. కృష్ణ తన బాల్యంలో చదువులో సగటు విద్యార్థి అని, పెద్దగా మార్కులు వచ్చేవి కావని గుర్తుచేసుకున్నారు. అయితే, ఇంటర్మీడియట్ రోజుల్లో ఏఎన్నార్ (అక్కినేని నాగేశ్వర రావు) తన కాలేజీకి వచ్చినప్పుడు ఆయనకు ఉన్న క్రేజ్, అభిమానుల ఫాలోయింగ్ చూసి తాను కూడా ఎప్పటికైనా అలా కావాలని బలంగా కోరుకున్నానని తెలిపారు. ఈ సంఘటనే నటుడిగా మారాలనే ఆయన సంకల్పానికి బీజం వేసింది. కృష్ణ నట జీవితం “గూఢచారి 116” సినిమాతో ప్రారంభమైంది. ఆ సినిమా నుంచే ఆయనకు గణనీయమైన అభిమానుల ఫాలోయింగ్ ఏర్పడిందని, విజయం వచ్చినా, అపజయం వచ్చినా అభిమానులు సమానంగా చూసేవారని పేర్కొన్నారు. అయితే, కృష్ణ సినీ జీవితంలోనూ సవాళ్లు ఎదుర్కొన్నారు. “సీతారామరాజు” చిత్రం తర్వాత ఒకసారి చక్రపాణి గారు తన సినిమాను చూసి, “నీతో ఎన్ని సినిమాలు తీస్తున్నారు ఇప్పుడు?” అని అడిగారని, “ఆరు, ఏడు సినిమాలు” అని చెప్పగానే, “వారంతా అయిపోతారు” అని వ్యాఖ్యానించారని కృష్ణ గుర్తుచేసుకున్నారు.

సినిమా బాలేదా అని అడిగితే, “బాలేకపోవడం కాదు, ఈ సినిమా చూసిన కళ్ళతో నిన్ను మరో సినిమాలో చూడాలంటే చాలా కాలం పడుతుంది” అని చక్రపాణి గారు చెప్పిన మాట తన జీవితంలో ఓ గొప్ప పాఠమని కృష్ణ వివరించారు. ఆ తర్వాత సినిమా ఫెయిల్ అయినప్పుడల్లా ఆ మాట గుర్తుకొచ్చేదని, జీవితంలో ఇంక సక్సెస్ రాదా అనే అపనమ్మకం కూడా ఏర్పడిందని వెల్లడించారు. అయితే, ఆ పట్టుదలతోనే “పాడిపంటలు” సబ్జెక్ట్‌ను తానే కూర్చుని తయారు చేయించుకొని, ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పట్లో తన శ్రేయోభిలాషి నవయుగ శంషేర్ రావు గారు, “నీవు కోలుకోలేని దెబ్బ తిన్నావు, ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి నాగేశ్వరరావు, రామారావు, శోభన్ బాబు సినిమాల మధ్య నీ సినిమా ఎందుకు? ఒక నెల తర్వాత విడుదల చేసుకో” అని సలహా ఇచ్చారని కృష్ణ తెలిపారు. కానీ “ఉంటే ఉంటాను, పోతే పోతాను, కానీ సంక్రాంతికే రిలీజ్ చేస్తాను” అని ధైర్యంగా చెప్పి విడుదల చేశానని, ఆశ్చర్యకరంగా “పాడిపంటలు” అందరి చిత్రాల కంటే 25 వారాలు ఆడిందని, అప్పటి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది లేదని కృష్ణ గర్వంగా వివరించారు.

కృష్ణ కుమారుడు మహేష్ బాబు గురించి మాట్లాడుతూ, “మహేష్‌కు మొదటి సినిమా రాకముందే ఫ్యాన్స్ ఉన్నారని, చైల్డ్ ఆర్టిస్ట్‌గా అసాధారణమైన టాలెంట్‌ను చూపించాడని” అన్నారు. “ముగ్గురు కొడుకులు”, “కొడుకు దిద్దిన కాపురం” సినిమాలలో మహేష్ నటన అద్భుతమని, ముఖ్యంగా “పోరాటం” సినిమాలో ఆరేళ్ల వయసులో చేసిన నటన చూసి దుండి గారు మహేష్ గొప్ప ఆర్టిస్ట్ అవుతాడని అప్పుడే చెప్పారని గుర్తుచేసుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *