Headlines

విదేశీ విద్యార్ధులకు ట్రంప్‌ మరో బిగ్‌ షాక్‌.. ఈ సారి ఏం ప్లాన్‌ చేశాడంటే!

విదేశీ విద్యార్ధులకు ట్రంప్‌ మరో బిగ్‌ షాక్‌.. ఈ సారి ఏం ప్లాన్‌ చేశాడంటే!


అమెరికాలో చదువు పూర్తిచేసి అక్కడే ఉద్యోగం సంపాదించాలని కలలుకనే విదేశీ విద్యార్థులకు ట్రంప్‌ ప్రభుత్వం మరో భారీ షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) కొత్త ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. డిగ్రీ పూర్తయిన తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) ద్వారా ఉద్యోగం చేసే విద్యార్థులపై ఏకంగా 1 లక్ష డాలర్లు, అంటే సుమారు 83 లక్షల రూపాయలకు పైగా ఫీజు విధించాలని యోచిస్తోంది. ఈ భారీ రుసుమును విద్యార్థులే భరించాలా లేక వారిని నియమించుకునే కంపెనీలు చెల్లించాలా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు, ఎఫ్-1 వీసా కలిగిన అంతర్జాతీయ విద్యార్థులకు నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇప్పటివరకు కోర్సు పూర్తయ్యేవరకు అమెరికాలో నివసించే వెసులుబాటు ఉండగా, కొత్త నిబంధనల ప్రకారం గరిష్టంగా నాలుగేళ్లు మాత్రమే నివాస అనుమతి లభిస్తుంది. ఒకవేళ కోర్సు నాలుగేళ్లకు మించి ఉంటే, విద్యార్థులు డీహెచ్‌ఎస్ (DHS) నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే, అమెరికాలో ప్రస్తుతం ఉన్న 3.3 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులపై తీవ్ర ఆర్థిక భారం పడనుంది. అమెరికాలో ఉన్నత విద్య, ఉద్యోగం కలలు కంటున్న భారతీయ విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు అనిశ్చితిలో పడింది.

మరిన్ని వీడియోల కోసం :

టాక్సిక్‌ క్రేజ్‌… ఫస్ట్ ఈవెంటే నెక్స్ట్ లెవల్‌!

ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే

పెళ్లిచూపులకు పదేళ్లు..తనని తాను స్టార్‌గా మలుచుకున్న రౌడీ భాయ్‌

లీస్ట్ బడ్జెట్‌.. రికార్డ్ టైమ్‌..సందీప్‌ స్కెచ్‌..ప్రభాస్‌కు సెట్ అవుతుందా?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *