Headlines

Viral Video: మత్స్యకారుడి వలకు చిక్కిన జలకన్య..! ఈ వింత చేప గురించి మీకు తెలుసా?

Viral Video: మత్స్యకారుడి వలకు చిక్కిన జలకన్య..! ఈ వింత చేప గురించి మీకు తెలుసా?


గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలుగురాష్ట్రాల్లోని వాగు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నారు. అలాగే అటు గోదావరి నదికి కూడా వరద ప్రవాహం పెరిగి ములుగు జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఈ వరద నీటిలో చేపలు పట్టేందుకు వెళ్లిన మత్సకారులకు ఓ ఆరుదైన చేప దొరికింది. మునుపెన్నడూ చూడని విధంగా వింత ఆకారంతో ఉన్న ఆ చేపను చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఈ క్రమంలో ములుగు జిల్లా వాజేడు మండలం ఏడుచర్లపల్లి గ్రామానికి చెందిన సమ్మయ్య అనే మత్స్యకారుడు మరికొందరు జాలర్లతో కలిసి శనివారం గోదావరిలో చేపల వేటకు వెళ్లాడు. అయితే వల వేసి లాగుతున్న సమయంలో ఒక అరుదైన చేప వారి వలకు చిక్కింది. చూడ్డానికి మిగతా చేపలకు బిన్నంగా విచిత్ర రూపంతో ఉండడంతో అక్కడున్న జాలర్లంతా దాన్ని వింతంగా చూశారు.

ఒంటినిండా నలుపు, తెలుపు వలయాలు, రెక్కలతో కాస్త వింతగా అనిపించిన్పటికీ.. చూడ్డానికి మాత్రం ఈ చేప ఎంతో అందంగా కనిపించింది. అయితే ఇంతటి సుదీర్ఘమైన మత్స్యకార జీవితంలో ఇలాంటి చేపను ఎక్కడా, ఎప్పుడూ చూడలేదు. దీని రూపం చాలా విచిత్రంగా, చూడగానే ఆకట్టుకునేలా ఉంది. బహశా ఇది జలకన్య అయి ఉండవచ్చని జాలర్లు అంటున్నారు.

ఇక సమ్మయ్య ఆ వింత చేపను భద్రంగా తన ఇంటికి తీసుకురావడంతో, విషయం తెలుసుకున్న గ్రామస్థులంతా దానిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చేపను వింతగా తిలకిస్తూ, తమ మొబైల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ వింత చేపకు సంబంధించిన ఫోటోలు ములుగు జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *